వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన ప్రకటనతో అంతా అయిపోలేదని భారతీయ కిసాన్ సంఘ్ నరేంద్ర మోడీకి తేల్చి చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఇంకా మిగిలిన డిమాండ్లను కూడా వాపసు తీసుకోవాల్సిందే అంటు రైతు సంఘాలు గట్టిగా పట్టబట్టాయి. అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా ఈరోజు ‘మహాపంచాయితి’ని నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల చిట్టాను మోడి ముందు రైతు సంఘం ఉంచింది. దాంతో మోడి సర్కార్ లో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన ఏడాదిగా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నరేంద్రమోడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని మిగిలిన డిమాండ్లను కూడా రద్దు చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇంతకీ రైతుల మిగిలిన డిమాండ్లు ఏమిటంటే ఉద్యమంలో భాగంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలట. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి, వ్యవసాయ విద్యుత్ కు మీటర్లకు వాడకం బిల్లును ఉపసంహరించుకోవాలట.
అలాగే ర్యాలీ చేస్తున్న లఖింపూర్ ఖేరీ లో కారుతో తొక్కించి చంపిన ఘటనకు మూల కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించి అరెస్టు చేయాలట. తమ డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు తమ ఉద్యమాన్ని ఆపేదిలేదంటు రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. 27వ తేదీన సమావేశమై కార్యచరణ నిర్ణయించనున్నట్లు ప్రకటించాయి. 26వ తేదీన ఢిల్లీ శివార్లకు భారీ ఎత్తున రైతులు ర్యాలీగా చేరుకోవాలని డిసైడ్ చేశాయి.
29వ తేదీన పార్లమెంటుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీని కూడా నిర్వహించబోతున్నట్లు రైతు సంఘం ప్రకటించింది. రైతు సంఘాల తాజా ప్రకటనతో కేంద్రంలో టెన్షన్ పెరిగిపోతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే రైతు సంఘాలు ఉద్యమాన్ని నిలిపేస్తాయని మోడి అనుకున్నట్లున్నారు. కానీ తమ డిమాండ్లను నూరుశాతం ఆమోదించి యాక్షన్ లో కనబరిచేంతవరకు ఉద్యమాన్ని నిలిపేది లేదని రైతులు చెప్పటంతో కేంద్రం తల పట్టుకుంటోంది.
విద్యుత్ బిల్లును ఉపసంహసరించుకోవటం, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటం కేంద్రం చేతిలోని పనే. కానీ రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం కేంద్రం చేతిలోని పనికాదు. ఎందుకంటే ఇప్పటికే కేసులన్నీ కోర్టు విచారణ పరిధిలోకి వెళిపోయాయి. ఇక చివరదైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను అరెస్టు చేయటమంటే కేంద్రానికి అవమానం అనే చెప్పాలి. ఏదేమైనా ఈనెల 24వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో డిమాండ్ల విషయం తేలిపోతుంది.
This post was last modified on November 22, 2021 11:52 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…