కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొలిసారి వెనక్కి తగ్గింది. గడిచిన ఏడేళ్ల పాలనలో .. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయంలోనూ వెనక్కి తగ్గిన దాఖలా మనకుకనిపించదు.కానీ, ఈ రోజు(శుక్రవా రం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తాను వెనక్కి తగ్గుతున్నట్టు(పరోక్షంగా) ప్రకటించి.. దేశాన్ని ఒక్కసారిగా నిర్ఘాంత పోయేలా చేశారు.
ఇప్పటి వరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కారు దేనిలో నూ వెనక్కి తగ్గని పరిస్థితిని గమనించాం. అంతేకాదు..రైతుల విషయాన్నే చూసుకుంటే.. తమకు గుదిబం డగా మారుతుందని.. కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచి పోషిస్తున్నారని.. పేర్కొంటూ… గడిచిన 9 నెలలుగా రైతులు గగ్గోలు పెడుతున్నారు.
అంతేకాదు.. మిత్ర పక్షాలు కూడా మోడీకి దూరమైనా.. ఆయన లెక్కచేయలేదు. కేం ద్ర మహిళా మంత్రి నవనీత్ కౌర్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజీనామా చేసినా.. మోడీ స్పందించలేదు. అంతేకాదు.. రైతులతో చర్చిస్తామే..తప్ప.. తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. సాగు చట్టాలకు అనుకూలంగా అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకున్నారు.
ప్రభుత్వ మీడియాను కూడా వినియోగించుకున్నారు. అనేక సందర్భాల్లో తనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి.. ఈ సాగు చట్టాలు మేలు చేస్తాయంటూ.. ప్రకటిం చారు. అలాంటి ప్రధాని ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని.. రద్దు చేస్తామని ప్రకటించారు.
అయితే.. ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక.. మోడీ వ్యూహం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. దీనిని తరచి చూస్తే.. రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు విప్లవం.. పనిచేస్తోంది. ఇది బీజేపీకి తీవ్ర శరాఘాతంగా పరిణమించింది. ఇటీవల 32 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. బీజేపీ కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం దక్కించుకుంది.
ఇది వచ్చే ఆరు మాసాల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషణలు వచ్చాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత కేంద్రానికి గుండెకాయ వంటి రాష్ట్రం ఉంది.
అదే సమయంలో పంజాబ్‌లో పాగా వేయాలని భావిస్తున్న రాష్ట్రం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు సరిదిద్దుకోక పోతే.. మున్ముందు కేంద్ర పీఠానికి కూడా బీటలు పడే ప్రమాదం ఉందని మోడీ గుర్తించినట్టు స్పష్టంగా అర్హమవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్‌కు ఈ మూడు చట్టాలు కలిసి వస్తాయి. కాంగ్రెస్ కు నాయకత్వ లేమి ఉన్నా.. మోడీ చేస్తున్న.. ప్రజావ్యతిరేక విధానాలే ఆ పార్టీకి ఇబ్బందులను తొలగించి.. రాజమార్గం ఏర్పాటు చేస్తున్నాయనిఅంటున్నారు. ఈ క్రమంలోనే మోడీ రైతుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం కంటే.. బీజేపీని రక్షించుకునే క్రమంలోనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on November 19, 2021 1:30 pm
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…