చంద్రబాబు కదలడానికి ముందే.. వైసీపీ ఢిల్లీని చుట్టేస్తోంది! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇటీవ ల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికార-విపక్ష పార్టీల మధ్య చెలరేగిన మాటల యుద్ధం.. అనేక రూపాల్లోకి మారింది. బంద్-నిరసన, దీక్ష-నిరసన దీక్ష.. అంటూ.. రెండు పార్టీలూ.. యుద్ధం ప్రకటించుకున్నాయి. ఇక, ఈ విషయాన్ని.. ఢిల్లీకి తీసుకు వెళ్తానని చెప్పిన.. చంద్రబాబు.. అన్నంత పనీ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయిందని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కొరుతూ.. రాష్ట్రపతిని కలిసి వచ్చారు.
అయితే.. ఇదే విషయంపై అటు ప్రధాని, ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోనూ మాట్లాడతానని అన్నారు. అయితే.. ఢిల్లీలో రెండు రోజులు మకాం వేసినా.. చంద్రబాబుకు వారికి అప్పాయింట్‌మెంట్లు లభించలేదు. దీంతో బాబు తిరిగి వచ్చారు. అనంతరం..అమిత్ తనకు ఫోన్ చేశారని.. జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్య పోయారని., త్వరలోనే అప్పాయింట్‌మెంటు ఇస్తానని హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఓకే అన్నారని తెలిసింది. సో.. ఇతమిత్థంగా టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్తితి ఇదీ.
కానీ, ఇంతలో వైసీపీ.. బాబు కదిలే సరికే ఢిల్లీ చుట్టి వచ్చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ నేతలు.. సీఎం జగన్‌ను దూషిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ నాయకుడు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం.. మాధవ్ కు దాదాపు పది నిమిషాలు సమయం కేటాయించిన కేంద్ర హోంమంత్రికి.. ఆధారాలతో సహా తన లెటర్ ప్యాడ్ లో వివరాలు పొందుపరుస్తూ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తున్న ఫొటో ను ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫిర్యాదుపై వెంటనే రియాక్ట్ అయిన షా.. మీరు చేసిన ఫిర్యాదును పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు మాధవ్ వెల్లడించారు. దీంతో చంద్రబాబు కన్నా ముందే.. అమిత్ షాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. మరి.. ఇది ఎటు మలుపుతిరుగుతుంది? ఫస్ట్ ఈ ఫస్ట్ అన్న విధంగా వైసీపీ ముందుగా ఫిర్యాదు చేసింది కనుక.. ఇప్పుడు టీడీపీ ఏం చెప్పినా.. సెకండరీనే అవుతుందా? చూడాలి అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 28, 2021 10:11 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…