ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పుంజుకోవాలని.. వచ్చే ఎన్నికలు లేదా.. ఏదైనా ఛాన్స్ వస్తే.. ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తు న్నారు. నిజమే.. ఏ పార్టీకి అయినా.. అంతిమ లక్ష్యం అధికారమే. అయితే.. దీనిని దక్కించుకునేందుకు.,. గతంలో మాదిరిగా.. పేపర్ ప్రకటనలు.. వార్తలు.. ప్రచారం వంటివి వర్కువట్ కాదని.. గత ఎన్నికల్లోనే తేలిపోయింది. సో.. నిత్యం ప్రజ ల్లో ఉండాలి.. వారి కోసం పనిచేయాలి.. లేదా పనిచేస్తున్నట్టు అయినా.. కనిపించాలి. అప్పుడే.. సింపతీ అనేది దక్కుతుంది.
కానీ, ఇప్పుడు టీడీపీ ఈ తరహా వ్యూహం కన్నా.. ప్రభుత్వంపై దాడి చేయడం ద్వారానో.. సీఎం జగన్‌ను బూచిగా చూపించడం ద్వారానో.. అధికారంలోకి వచ్చేస్తాం.. అనే భ్రమల్లో టీడీపీ అధినేత నుంచి కార్యకర్త వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రజలలో ఉండాల్సిన చంద్రబాబు ఆదిశగా ఆలోచన చేయడమే మానేశారా? అనే ప్రశ్న తెరమీదకి వస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా.. మూడు సమస్యలపై ప్రజలే రోడ్డున పడుతున్నారు. వీరిని ఎవరూ లీడ్ చేయడం లేదు. ఎవరూ మద్దతివ్వడం లేదు. అయితే.. ఆయా సమస్యలేవీ.. ఒక ప్రాంతానికే.. ఒక జిల్లాకో పరిమితం కాలేదు.
మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రజలు పోరాటాలకు దిగుతున్నారు. వీటిలో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వమే తీసుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు.. విద్యుత్ బిల్లుల్లో.. ట్రూ అప్ చార్జీల పేరిట.. ప్రజా ధనాన్ని ప్రభుత్వం దోచుకుంటోందనే ఆవేదన ప్రజల్లో స్పష్టం గా కనిపిస్తోంది. ఇక, మూడు.. రైతుల విద్యుత్ వినియోగానికి మీటర్లు బిగించడం. ఈ మూడు అంశాలపైనా.. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజల్లో ఆవేదన ఆందోళన కనిపిస్తోంది. మరి ఈ అంశాలపై.. టీడీపీ ఎక్కడైనా స్పందించిందా? అంటే.. లేదనే సమాధానం వస్తోంది.
గతంలో కొన్ని రోజులు రైతుల విద్యుత్ కు మీటర్లు బిగించడం ఏంటని .. ప్రకటనలు గుప్పించి.. మీడియా ముందు.. వ్యాఖ్యలు చేసి సరిపెట్టారే.. తప్పక్షేత్రస్థాయిలో రైతుల గుండె చప్పుడును విన్న టీడీపీ నాయకు లు ఒక్కరూ కనిపించడం లేదు. ఇక.. ఎడిడెడ్‌పై తీవ్రస్థాయిలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చినా.. ఒక్క నాయకుడు కూడా.. టీడీపీ పక్షాన గళం వినిపించలేదు.
మరి ప్రజా ఉద్యమాలను కూడా పట్టించుకోకుండా.. అధికారంలోకి వచ్చే స్తామనే ధీమా ఏమేరకు కరెక్ట్? సరైన సమయంలో సరైన విదంగా స్పందిస్తే.. మైలేజీ దానంతట అదే రాదా?! అనే చిన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు మిస్సవుతున్నారు. ఎయిడెడ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుతుంటే.. బాబు చిన్న ప్రకటనతో సరిపెట్టడం అంటే.. ఏమనుకోవాలి? ఇదీ.. ఇప్పుడు సామాన్యుల ప్రశ్న.
This post was last modified on October 28, 2021 8:36 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…