తాజాగా ఏపీలో జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించిన తీరుపై నెటిజన్లు.. ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రైట్ వేవ్‌లో బాబు రియాక్షన్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య జరిగిన వివాదంలో నేరుగా చంద్రబాబు జోక్యం చేసుకుని మంచి పనిచేశారని.. అంటున్నారు.
నిజానికి ఇప్పుడు కనుక ఊరుకుని ఉంటే.. టీడీపీ పై ప్రజల్లో సానుభూతి పెరిగేది కాదని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు దీక్షకు దిగడం.. కలిసి వచ్చిన పరిణామంగా నెటిజన్లు చెబుతున్నారు. ఆయన 36 గంటల పాటు ఓపికగా దీక్ష చేసిన వైనం.. అందరినీ కదిలించిందని.. ఎవరూ ఊహించని విధంగా సభకు తమ్ముళ్లు కదిలి వచ్చారని.. చెబుతున్నారు.
చంద్రబాబు.. తన జీవితంలో తొలిసారి చేపట్టిన 36 గంటల నిరవధిక నిరసన దీక్ష పార్టీలో జోష్ పెంచిందని ఎన్నారై ల నుంచి కూడా స్పందన వస్తోంది. టీడీపీలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చిందని.. నేతల మధ్య అంతరాలను తగ్గించిందని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల తర్వాత.. టీడీపీలో నిస్తేజం ఏర్పడింది. గెలిచిన వారిలోనూ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. అంతేకాదు.. ఉన్నవారిలోనూ ఎక్కువ మంది పార్టీకి అంటీ ముట్టనట్టు ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందా? అనే చర్చ జోరుగా హల్చల్ చేసింది. ఈ సమయంలో బాబు దీక్ష ద్వారా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని అంటున్నారు.
నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న వారు.. భారీ ఎత్తున తరలి రావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పుంజుకుందనే భావన సర్వత్రా వినిపిస్తోంది. ఇటీవలే సీవోటరు సర్వే వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే వాదన స్పష్టమైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి మద్దతు లభించిందని చెబుతున్నారు. ఇక, రాష్ట్రంలో జరిగిన ఘటనను ఢిల్లీ వరకు తీసుకువెళ్లడం ద్వారా.. కేంద్రం స్థాయిలో తమకు పలుకుబడి ఉందని.. తమకు ఎంతో మైలేజీ ఉందని చెబుతున్న వైసీపీకి.. గట్టి షాక్ తగిలేలా.. చేయగలిగారని.. చంద్రబాబుకు లైకులు పడుతున్నాయి. మొత్తానికి టీడీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. ఎన్నారైలలో చర్చకు దారితీసింది.
This post was last modified on October 26, 2021 10:43 pm
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ…
ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం టీమ్ బాక్సాఫీస్ సంభవం పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి, ఫలితాలు తేలిపోయాయి కాబట్టి మూవీ లవర్స్ ఫ్రెష్ గా రిలీజయ్యే…
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…