తెలంగాణ మంత్రి, సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు.. హరీష్‌రావుకు.. భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బలమూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. ఈ నెల 13తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
అయితే.. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కితీరాలనే కసితో పనిచేస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఎందుకంటే.. ఇప్పటికే జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యత విషయంలో ఆయన గాడి తప్పారు. అక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో హరీష్‌కు మార్కులు తగ్గాయనే ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు హుజూరాబాద్‌ను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాదు.. ఇక్కడ గెలిచి.. తాను ఐరన్ లెగ్ కాదనే ప్రచారం చేసుకునేందుకు ఆయన రెడీగా ఉన్నారు. ఇక, ఇక్కడ గెలుపు అనేది అధికార పార్టీకి ప్రాణప్రదంగా మారింది. మరోవైపు.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో హరీష్ వర్సెస్ ఈటల అన్నట్టుగా పోటీ మారిపోయింది. సామాజిక సమీకరణలు.. పథకాలు వంటివాటిపై హరీష్.. కొన్నాళ్లుగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజు మొత్తంలో ఎక్కువ సేపు హుజూరాబాద్‌లోనే ఉంటున్నారు. అడుగడుగునా సభలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో జనాలను పోగేసే బాధ్యతలను కార్యకర్తలకు, కీలక నేతలకు అప్పగించారు. అయితే.. తాజాగా సోమవారం ఇక్కడ నిర్వహించిన ప్రచార సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉపఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల సభలో మాట్లాడారు. అయితే ఈ సభలో ముందు వరుసలో మాత్రమే జనాలు ఉన్నారు. వెనుక వరుసలో జనాలు లేక ఖాళీ కుర్చీలు కనిపించాయి. ఎన్నికలకు మరో 18 రోజులే ఉండడం.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం..హరీ ష్ వర్గంలో గుబులు రేపుతోంది. కాగా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిని ఎలా చూస్తారో చూడాలి.
This post was last modified on October 11, 2021 8:22 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…