అధికారంలో చేతిలో ఉంటే ఏమైనా చేస్తామన్నట్లుగా వ్యవహరించే తీరు కొందరిలో ఉంటుంది. నిజానికి ఇలాంటివారి కారణంగా ప్రభుత్వానికి కొత్త తలనొప్పులే కాదు.. అనవసరమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరి అత్యుత్సాహం ప్రభుత్వాధినేత ఇమేజ్ ను సైతం డ్యామేజ్ చేస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలో చోటు చేసుకుంది.
సాధారణంగా కారు నెంబరు అంకెల్లో ఉంటుంది. ఈ విషయాన్ని చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతారు. కానీ.. పదాల్లో.. పేర్లలో ఉన్న కార్ నెంబరు ప్లేట్ ను ఎప్పుడైనా చూశారా? తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జర్నీ చేసిన కారు నెంబరు స్థానంలో రాయించిన అక్షరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
నెంబరు ప్లేట్ లో ఉండాల్సిన అంకెల్ని పక్కన పెట్టేసి.. ‘‘AP CM JAGAN’’ (ఏపీ సీఎం జగన్) పేరుతో నెంబరు ప్లేట్ పెట్టేశారు. అంబాజీపేటలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రయాణించిన కారు నెంబరు ప్లేట్ స్థానంలో ఉన్న అక్షరాలుఅందరిని ఆకర్షిస్తోంది.
ఇంతకీ.. ఆయనదేనా ఈ కారు? ఇంకెవరిదైనా? అన్న విషయం మీద క్లారిటీ రాలేదు. ఏమైనా.. ఇలాంటి సిత్రాలు ఏపీలోనే సాధ్యమేమో?
This post was last modified on May 31, 2020 3:22 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…