Political News

పెట్రోలుపై జీఎస్టీ… ఆశ దోశ అప్పడం

అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కాస్త కళ్లాలు వేసేందుకు వీలుగా.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని.. అలాంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుకండా బాదేస్తున్న పన్నుతో.. పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్న వేళ.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ప్రభుత్వాలకు జరిగే ఆర్థిక నష్టం భారీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది.

ఇందుకు తగ్గట్లే.. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం ఉంటుందన్న విషయం తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. లక్నోలో జరిగిన తాజా జీఎస్టీ మండలి 45వ సమావేశ వివరాల్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారన్న ఆశల మీద నీళ్లు చల్లారు. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని తేల్చేశారు.

పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ వంటి ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలన్న పిటీషన్ మేరకు ఈ అంశాన్ని పరిశీళించాలని కేరళ హైకోర్టు జీఎస్టీ కౌన్సిల్ కు సూచన చేసింది. దీనిపై తామ చర్చించామని.. అనేక రాష్ట్రాలు అందుకు సుముఖత చూపలేదని.. ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే దీనికి కారణమని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే విషయాన్ని కేరళ హైకోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.

ఇక..జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు విలాస.. హానికారక ఉత్పత్తులపై సెస్ విధించనున్నారు. ముందుగా అనుకున్నట్లు 2017 జులై నుంచి ఐదేళ్ల పాటు మాత్రమే రాష్ట్రాలకు ఈ పరిహారం అందిస్తారు. అయితే.. సెస్ వసూళ్లు మాత్రం 2026 మార్చి వరకు సాగుతుంది. కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్న రాష్ట్రాలు.. వాటిని తీర్చేందుకు ఈ నిధిని ఇవ్వనున్నారు.

This post was last modified on September 18, 2021 11:58 am

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

1 hour ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

3 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

3 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

3 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

7 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

7 hours ago