వైద్యరంగంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించటంలో ప్రతి ఎంబీబీఎస్ విద్యార్ధి ఏడాదిపాటు సేవలందించాలన్న జగన్ సూచన తొందరలోనే ఉత్తర్వులు రూపంలో రాబోతోంది. అలాగే ప్రతి పీజీ విద్యార్ధి ఏడాదిపాటు రెసిడెన్సీ చేయాల్సిందే. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష చేసినపుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం సూచనల ప్రకారం ఉన్నతాధికారులు ఫైల్ రెడీచేశారు.
ప్రభుత్వ నిర్ణయం గనుక ఆదేశాల రూపంలో బయటకు వస్తే ప్రతి ఏడాది 5300 మంది ఎంబీబీఎస్ విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పనిచేయాల్సుంటుంది. అలాగే 2300 పీజీ విద్యార్ధులు ప్రాంతీయ, జిల్లా బోధనాసుపత్రుల్లో సీనియర్ రెసెడెంట్లుగా పనిచేయాల్సుంటుంది. ఐదున్నరేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చివరి ఏడాది గ్రామీణ ప్రాంతంలోను, బోధనాసుపత్రుల్లో విద్యార్ధులు పనిచేయాల్సుంటుంది. అంటే ఇకనుండి ఎంబీబీఎస్ కోర్సు ఆరున్నర ఏళ్ళని చెప్పుకోవచ్చు.
జగన్ ఉద్దేశ్యం ఏమిటంటే గ్రామీణప్రాంతాల్లోని జనాలకు నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచటమే. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని జనాలకు వైద్యసేవలు అందుబాటులో లేవన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికోసం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్కులను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ క్లినిక్కులు జనాల అవసరాలకు సరిపోవు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ విద్యార్ధులు సేవలందించాలనే నిర్ణయం తీసుకున్నది.
నిజానికి ఇలాంటి నిర్ణయం 2010లోనే తీసుకున్నా అమల్లోకి రాలేదు. పైగా 2016లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. పీజీ విద్యార్ధులకు రెసిడెన్సీ విధానాన్ని కూడా ఆప్షనల్ చేశారు. దాంతో విద్యార్ధుల్లో అత్యధికులు గ్రామీణప్రాంతాల్లో పనిచేయటానికి ఇష్టపడటంలేదు. ఇదే సందర్భంలో కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్ధాన్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రూరల్ ప్రాక్టీసు విధానం అమల్లో ఉంది. కేరళలో అయితే ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధన అమల్లోఉంది.
గ్రామీణప్రాంతాల్లో ఏడాదిపాటు సేవలందించిన విద్యార్ధులు పీజీలో రెసిడెన్సీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీన్ని మెడికల్ విద్యార్ధి రిజిస్ట్రేషన్ విషయంలో చెప్పబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా జగన్ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాలకు నిరంతర వైద్యసేవలు అందుబాటులోకి రావటం ఖాయం. చూద్దాం ఎప్పటినుండి అమల్లోకి వస్తుందో.
This post was last modified on September 17, 2021 11:08 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…