సైదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బాలికను దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు.. అతనిని పట్టుకుంటే రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు.
కాగా.. తాజాగా.. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటన అందరినీ షాకింగ్ కి గురి చేసింది. నిందితుడు దొరికితే.. తమకు అప్పగించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అతను ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. సైదాబాద్ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు మధ్య తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ గురువారం ఉదయం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందిజేశారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని హామీఇచ్చారు.
మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులు హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. ప్రభుత్వం అందజేసిన రూ.20 లక్షల సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్ బాలిక కుటుంబ సభ్యులు అంటున్నారు.
This post was last modified on September 16, 2021 11:05 am
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నేళ్లలో వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొందో తెలిసిందే. ఆమె…
మనకు సంక్రాంతి ఎంత కీలకమో అదే పండగను పొంగల్ గా వ్యవహరించే కోలీవుడ్ కు కూడా అంతే ముఖ్యం. అందుకే…
పవర్ పాక్డ్ డ్యాన్స్ లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటి శ్రీ లీల. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత, కేటీఆర్ లపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం…
దేశమంతా ప్రధాన భాషల్లో విడుదల చేసినంత మాత్రాన ఏ సినిమా అయినా ప్యాన్ ఇండియా అయిపోదు. దాన్ని అన్ని రాష్ట్రాల…
అదేంటి గత ఏడాది వచ్చిన సినిమా ఇప్పుడు మళ్ళీ ట్రెండవ్వడం ఏమిటనుకుంటున్నారా. దానికి కారణం విజయ్ 69. రాజకీయాల్లోకి వెళ్ళడానికి…