తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
దమ్ముంటే తనపై పోటీకి కెసిఆర్ ఆర్ కే లేదా ఆయన అల్లుడు మంత్రి హరీష్ రావు ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడదామని…. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల రాజేందర్ ప్రకటించారు.
ఒకవేళ మీరు ఓడిపోతే సీఎం పదవి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. టిఆర్ఎస్ పార్టీ ఆరిపోయింది దీపం అని… ఆరిపోయే దీపం ముందు ఎక్కువ వెలుతురు ఇస్తుందని ఎద్దేవా చేశారు. తాను ఉన్నంతకాలం ప్రజల కోసం కొట్లాట తానని… పదవుల కోసం కాదని ఈటెల స్పష్టం చేశారు. ఉద్యకారుల ఉసురు టీఆర్ఎస్ పార్టీకి కొడుతుందని… టీఆర్ఎస్ పార్టీ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయని తెలిపారు. ఈటెల రాజేందర్ దద్దమ్మ కాదని..పని చేతకానివాడు కాదని.. అయి ఉంటే ఇంత అభివృద్ధి జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates