Political News

మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కోట్లు తీసుకున్నవా లేదా రేవంత్‌?

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.. ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ పార్టీలో ఉన్న సీనియ‌ర్ ద‌ళిత నాయ‌కుడు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్లు.. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. ఒక్క‌సారిగా అంద‌రూ మోత్కుప‌ల్లివైపు చూసేలా చేశాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష విరమించిచారు. దళిత బంధు‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తీరుకు నిరసనగా తన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ దీక్ష ఆరు గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రతిపక్ష పార్టీల దగ్గర నీతి లేదని మోత్కుపల్లి నర్సింహులు విమ‌ర్శించారు. వారికి అనుకోకుండానే దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. అనుకోకుండానే దళితుల కోసం యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి యాత్ర‌లు ఎందుకు చేయ‌లేద‌ని అని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో తాను ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా దళితుల గురించి మాట్లాడలేదని చెప్పారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపైనా.. మోత్కుప‌ల్లి.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. తిట్ల వ‌ర్షం కురిపించారు.

“రాజకీయ బ్రోకర్ ఒక చిల్ల‌ర‌ గాడు రేవంత్ రెడ్డి” అని రేవంత్‌ను విమర్శించారు. రేవంత్‌కు ఇన్ని వేల కోట్లు ఎక్కడివి? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ బ్లాక్ మెయిలర్ రేవంత్ అన్నారు. వెంచర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తాడని ఆరోపించారు. మల్లారెడ్డి దగ్గర టీడీపీలో ఉన్నప్పుడు కోట్లు తీసుకున్నవా లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ లాగానే కాంగ్రెస్ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లు ఉన్నారు వారికి రాని పదవి ఇతనికి ఎలా వచ్చిందన్నారు. తమకు అడ్డమొస్తే రేవంత్‌ను తొక్కేస్తామన్నారు.

దళితులకు 10 లక్షలు ఇస్తే ఆయన సీఎం కాలేడని, అందుకే వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తున్నాడని విమర్శించారు. దళిత రక్షకుడు, దళిత బంధువు సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధుతో విపక్ష పార్టీల్లో వణుకు పుడుతోందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రిగినా.. ఈటల రాజేందర్ గెలవడని మోత్కుప‌ల్లి జోస్యం చెప్పారు. ఆయన చేస్తున్న పాద‌యాత్ర ద్వారా హుజూరాబాద్‌ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఆలయ భూములు ఆక్రమించి అమ్ముకున్నాడని ఆరోపించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో చీఫ్ ప‌ద‌వి కోసం ఎంద‌రో సీనియ‌ర్లు ప్ర‌య‌త్నించినా.. అది నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన‌ రేవంత్‌కు ఎలా ద‌క్కింద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌లో మ‌రో వివాదానికి దారితీస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సీనియ‌ర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on %s = human-readable time difference 7:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత యూజర్లకు వాట్సాప్ హెచ్చరిక

ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న వాట్సాప్‌ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…

2 mins ago

జ‌గ‌న్ పాల‌న‌.. చంద్ర‌బాబు టెస్టులు!

గ‌త వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ సాగించిన పాల‌న ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుకు విష‌మ ప‌రీక్ష‌లు పెడుతోందనే భావ‌న కూట‌మి…

5 hours ago

11 నుంచి అసెంబ్లీ..11 మంది వస్తారా?

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…

5 hours ago

వీరమల్లుని కవ్వించడానికి మరో ఇద్దరు

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…

7 hours ago

పల్లెటూరి మిస్టరీ – హిట్టు కొట్టే హిస్టరీ

ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…

9 hours ago

అమ‌రావ‌తిలో.. చంద్ర‌బాబు కొత్త ఐడియా!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో అంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ యించుకున్న‌ట్టు తెలిసింది. త‌ద్వారా.. ఆది నుంచి…

10 hours ago