బోరు బావిలో మూడేళ్ల బాలుడు.. బోరు బావిలో రెండేళ్ల పాప.. ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. ప్రతిసారీ ఆ మాత్రం జాగ్రత్త ఉండదా.. బోరు బావులు పూడ్చాలి లేదా వాటి మీద ఏమైనా అడ్డం పెట్టాలి అన్న జ్ఞానం ఉండదా.. అనుకుంటాం. కానీ మళ్లీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వందల కేసుల్లో ఒకటీ అరా మినహాయిస్తే ఇలాంటి సందర్భాల్లో పిల్లల ప్రాణాలు నిలవడం కష్టమే.
తాజాగా మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లిలో ఇదే విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడి కథ విషాదాంతమైంది. 120 అడుగుల లోతుకు బోరు బేయగా.. బాలుడు 17 అడుగుల లోతులోనే ఉన్నాడు. అంత తక్కువ లోతులో ఉన్నా.. సహాయ బృందాలు ఎంతో వేగంగా స్పందించి 12 గంటల్లోనే బాలుడు పడ్డ ప్రదేశానికి సమాంతరంగా గుంత తవ్వి అతణ్ని చేరుకున్నా ఫలితం లేకపోయింది.
అప్పటికే బాలుడు చనిపోయాడు. మీద మట్టి పెళ్లలు పడటం.. ఫలితంగా ఆక్సిజన్ అందకపోవడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాలుడు బోరు బావిలో పడగా.. ఉదయం ఐదున్నర ప్రాంతంలో మృతదేహాన్ని వెలికి తీశారు. నిన్న సాయంత్రం వరకు తమ చుట్టూనే ఉంటూ ఆడుకున్న పిల్లాడు ఇలా శవమై తేలడంతో తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు.
దారుణమైన విషయం ఏంటంటే.. ఆ బాలుడు పడింది వాళ్ల సొంత బోరులోనే. ఆ బోరు వేసింది కూడా నిన్ననే. 120 అడుగుల లోతు వరకు బోరు వేసినా నీళ్లు పడలేదు. దీంతో పని ఆపించేశారు. ఐతే నీళ్లు పడని బోరు కావడంతో కేసింగ్ వేయలేదు. దాన్ని పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. సమీపంలోనే ఆడుకుంటున్న పిల్లాడిని గమనించలేదు. అతను బోరు బావిలో పడిపోయాడు. కొన్ని గంటల్లోనే సహాయ బృందాలు వచ్చి ఎంతో కష్టపడ్డా కూడా బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు.
This post was last modified on May 28, 2020 12:35 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…