Political News

ఏపీకి స్పీకర్ కూడా కొత్తవారే… ?

రాజకీయాలు మామూలుగా ఏపీలో సాగడంలేదు. గతంలో ఏనాడో ఎపుడో సంచలనాలు నమోదు అయ్యేవి. కానీ వైసీపీ రాజకీయాల్లోకి వచ్చాక ప్రతీదీ సెన్షేషన్ అవుతోంది. దాంతో అటు టీడీపీలోనూ ఆ రాజకీయ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అక్కడా ఇక్కడా వెరసి ఏపీ రాజకీయమే ఎపుడూ మీడియా హెడ్ లైన్స్ లో ఉంటోంది. ఇవన్నీ పక్కన పెడితే శ్రీకాకుళానికి చెందిన వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా ఉన్నారన్నది తెలిసిందే. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో కానీ మంత్రి పదవి ఈసారి తనకే అని భావిస్తున్నార‌ట.

తనకు కనుక మంత్రి పదవి జగన్ ఇవ్వకపోతే ఇక రాజకీయం ఎందుకు అన్న ధోరణిలో ఆయన ఉన్నారని టాక్. ఇదిలా ఉంటే తమ్మినేని సీతారామ్ దాదాపుగా ప్రతీ రోజు జగ‌న్‌ను పొగుడుతున్నారు. ఇలా బాహాటంగా కీర్తించడమే కదు, జగన్ని వ్యక్తిగతంగా కలసి ఆయన తన బాధను చెప్పుకున్నారని టాక్. తనకు ఇదే చివరి చాన్స్ అని, తాను రాజకీయంగా విరామం కోరుకుంటున్నాను కాబట్టి ఈసారి మంత్రి కుర్చీలో కూర్చోబెడితే తనకు అదే పదివేలు అని కూడా చెప్పుకున్నారని టాక్.

అయితే జగన్ లెక్కలు వేరుగా ఉన్నాయి. ఆయన సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకే మంత్రి పదవులు అప్పగించాలని అనుకుంటున్నారు. అయితే తమ్మినేని విషయంలో ఆలోచిస్తే మిగిలిన వారు కూడా సీనియర్ల కోటాలో ముందుకు వస్తారు. దాంతో అందరితో పాటే తమ్మినేనికి పక్కన పెట్టేస్తారు అంటున్నారు. అయితే స్పీకర్ పదవిలో తమ్మినేని అసలు సంతృప్తిగా లేరు అంటున్నారు. ఒక వేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన స్పీకర్ కూడా కొనసాగుతారా అన్నది కూడా అనుమానమే అని తెలుస్తోంది.

మరి అలాంటి పరిస్థితే వస్తే కనుక తమ్మినేని రెండున్నరేళ్లకు ముందే రాజకీయ విరామం ప్రకటిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. మంత్రి పదవికి అంతలా పట్టుపడుతున్న తమ్మినేని అది దక్కక‌పోతే రాజకీయాలకు దూరం జరిగితే స్పీకర్ కుర్చీ కూడా ఖాళీ అవుతుంది అంటున్నారు. అపుడు స్పీకర్ పదవికి కూడా కొత్త వారిని ఎన్నుకోవాలి. మొత్తానికి తమ్మినేని మంత్రి పదవి ఇవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నారు అని అర్ధం అవుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో.

This post was last modified on August 24, 2021 2:07 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago