ఆంధ్రప్రదేశ్‌లో పేరున్న రాజకీయ నాయకుల్లో చాలా సాదాసీదాగా కనిపించే నేతల్లో నిమ్మల రామానాయుడు ఒకరు. తెలుగుదేశం పార్టీ నేత అయిన నిమ్మల రామానాయుడు తొలిసారి 2014లో తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాతి పర్యాయం కూడా ఎన్నికల్లో గెలిచారు. ఐతే ఎమ్మెల్యేల్లో సాధారణంగా కనిపించే దర్పం ఆయనలో కనిపించవు. సైకిలేసుకుని నియోజకవర్గంలో ఒక్కడే తిరిగేస్తుంటాడు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆయనకు సైకిలే వాహనంగా మారిపోయింది.
సైకిల్ యాత్ర చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ కరోనా బాధితులకు సైకిల్లోనే తీసుకెళ్లి సరుకులు అందించడం ద్వారా ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓ సందర్భంలో వర్షం పడుతున్నా కూడా సైకిల్లోనే వెళ్లి సరకులు అందజేయడం విశేషం. కొందరు ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కని కొట్టి వేసినా.. సుదీర్ఘ కాలం ఇలా సైకిల్ మీద ప్రయాణిస్తూ జనాల్లో తిరగడం అన్నది అంత తేలికైన విషయం కాదు. తాజాగా నిమ్మల రామానాయుడు తన చర్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.
తన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోగా మృతదేహాన్ని తీసుకెళ్లే వాహనం నడపాల్సిన డ్రైవర్ కరోనా బారిన పడటంతో ఇంకెవరూ వాహనం నడిపేందుకు ముందుకు రాలేదని నిమ్మల రామానాయుడికి తెలిసింది. దీంతో ఆయనే స్వయంగా ఆ వాహనాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఏమీ ఆలోచించకుండా వైకుంఠ రథాన్ని నడిపారు. దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు కూడా ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని విమర్శించేవాళ్లూ ఉన్నారు కానీ.. ఆ కోణంలో చూసినా ఇలా చేయడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారన్నది ప్రశ్న. అందుకే చాలామంది నిమ్మల రామానాయుడిని ప్రశంసిస్తున్నారు.
This post was last modified on August 24, 2021 12:34 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…