పంజాబ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఎన్నికలు వచ్చేఏడాది మార్చిలో ప్రాంతంలో జరుగనున్న సమయంలోనే పీకే ఎందుకు రాజీనామా చేయాల్సొచ్చింది ? అన్న విషయంపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే పీకే రాజీనామా విషయంపై పెద్దగా చర్చ జరగాల్సినంత సీన్ లేదు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరించింది పీకేనే.
అదే పీకేని ఈమధ్యనే పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీంద్ర సింగ్ ప్రభుత్వ సలహదారుగా నియమించారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ పీకే సలహాలతోనే గట్టిగా పనిచేయాలని అమరీందర్ అనుకుంటున్న సమయంలోనే ఆయన రాజీనామా కలకలం రేపుతోంది. వ్యక్తిగతంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే పీకే రాజీనామా చేశారట. ఇదే సందర్భంలో ఇక్కడ గమనించాల్సిన విషయాలు మూడున్నాయి.
మొదటిది సలహాదారుగా రాజీనామా చేసినంత మాత్రాన తానుకాకపోయినా తన ఐప్యాక్ బృందమంతా కాంగ్రెస్ కు వ్యూహాలను అందించవచ్చు. రెండో కారణం ఏమిటంటే పంజాబ్ సీఎం-పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గున మండుతోంది. వీళ్ళమధ్య ఆధిపత్య గొడవలతో పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిపోయింది. రేపు టికెట్ల కేటాయింపుల్లో కూడా వీళ్ళద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం.
ఇక మూడోది ఏమిటంటే తాను సూచనలు చేసినా, సలహాలిచ్చినా అమలయ్యే అవకాశాలు తక్కువే. పోయిన ఎన్నికల్లో అంటే అమరీందర్ కు తిరుగులేదు కాబట్టి పీకే వ్యూహాలు పక్కా అమలయ్యాయి. కానీ ఇపుడా పరిస్ధితి లేదు. అమరీందర్ ఏమో సోనియాగాంధికి మద్దుతుదారుడు కాగా సిద్ధూఏమో రాహూల్ గాంధీ, ప్రియాంకగాంధీల ఆశీస్సులతో పీసీసీ అధ్యక్షుడయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం నేపధ్యంలో పంజాబ్ లో ఇఫుడు తాను జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని పీకే గ్రహించారట. ప్రభుత్వ సలహారుగా ఉంటు అమరీందర్ కు మాత్రమే మద్దతుగా ఉండాలి. అలాకాకుండా ఇటు అమరీందర్ అటు సిద్ధూలకు ఏకకాలంలో సలహాలివ్వటమంటే ఒకేసారి రెండు పడవల మీద కాళ్ళు పెట్టటమే అని పీకే అర్ధం చేసుకున్నట్లున్నారు. దాంతో రాహూల్+ప్రియాంక కోటరితో చేతులు కలిపాలని డిసైడ్ అయినట్లే ఉంది. అందుకనే ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చేసేశారు.
This post was last modified on August 6, 2021 9:50 pm
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…