హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గరపడుతోంది. ఈ హుజురాబాద్ లో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు తగ్గకుండా ఈ ఉప ఎన్నిక దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి.. ఈటల రాజేందర్ పోటీకి దిగుతుండగా… టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ పడతారా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ తరఫున నిలబడే హుజురాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తాజాగా అభ్యర్థి ఎవరనేది తేల్చిందని సమాచారం.
ఈ ఎన్నిక నేపథ్యంలో.. దళిత బంధు పథకం తీసుకువచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ స్కీమ్ తమ పార్టీని హుజురాబాద్‌లో గెలిపించేందుకు ఉపయోగపడుతున్నదని భావిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. ఈ పథకం ప్రారంభ ముహుర్తం ఈ నెల 16న ఖరారు కాగా, అదే రోజున సీఎం కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అభ్యర్థిని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత.. నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates