ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ దూకుడు చూస్తే.. మామూలుగా కనిపించడం లేదు. కేంద్రంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతోంది. నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఎంపీలు పోడియంను చుట్టుముట్టి మరీ.. నినాదాలు చేయడంతోపాటు.. ప్రధానిని, స్పీకర్‌ను సైతం విమర్శిస్తున్నా రు. ఈ మొత్తం ఎపిసోడ్ వారం రోజులుగా ఇలానే సాగుతోంది.
పార్లమెంటులో తంతు చూస్తున్న ప్రతి ఒక్కరికీ.. బీజేపీతో వైసీపీకి చెడిందా ? అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజకీయంగా చూసుకుంటే.. వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం. రాజ్యసభలో బిల్లుల ఆమోదం విషయంలోనూ, త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతు లేకపోతే ఎన్డీయే అభ్యర్థి గెలవడం కూడా కష్టమే..!
ఇక, పాలన పరంగా చూసుకుంటే.. వైసీపీకి బీజేపీ మద్దతు ఎంతో కీలకం. హోదా, పోలవరం..వంటి విషయాల్లో కేంద్ర సహకారం అవసరం. అయితే..ఈ క్రమంలో ఇప్పటికే అనేకరూపాల్లో వైసీపీ.. కేంద్రంలోని బీజేపీకి సహకరిస్తూనే ఉంది.
రాష్ట్రపతి ఎన్నిక సహా.. అనేక విషయాల్లో వైసీపీ సంపూర్ణ సహకారం బీజేపీకి అందుతూనే ఉంది. అత్యంత వివాదాస్పదమైన రైతు చట్టాలకు సైతం వైసీపీ రాజ్యసభలో ఆమోదం తెలిపింది. ఇక, రాజ్యసభ సీట్ల విషయంలోనూ నత్వానీకి ఇవ్వాలని కోరడంతో వైసీపీ నేతలు వెనుక ముందు చూడకుండా.. ఆయనకు కేటాయించారు. మరో సీటును కూడా త్వరలోనే కోరుతున్నట్టు సమాచారం.
ఇలా అన్ని రూపాల్లోనూ వైసీపీ కేంద్రంలోని బీజేపీ సహకారం అందిస్తోంది. అయినప్పటికీ.. తాము కొన్నాళ్లుగా కోరుతున్న పనిచేయడం లేదని.. తమకు ఏమాత్రం సహకరించడం లేదని.. వైసీపీ.. కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది.
అదేంటంటే.. వైసీపీ తరఫున గెలిచిన రఘురామ.. తర్వాత కాలంలో టీడీపీతో చేతులు కలిపారని.. ఈ క్రమంలో ఆయనపై వేటు వేయాలని.. వైసీపీ కోరుతోంది. అయితే.. ఇప్పటి వరకు కస్పీకర్ చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ స్వయంగా భేటీ అయి.. ఈ విషయంపై రిక్వస్ట్ చేసినా.. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు.
ఈ క్రమంలోనే వైసీపీ.. బీజేపీపై తీవ్ర అసహనంతో ఉందని అంటున్నారు పరిశీలకులు. దీనిని మనసులో ఉంచుకునే పార్లమెంటులో తీవ్ర రగడ సృష్టిస్తోందని చెబుతున్నారు. అయితే.. కేంద్రం ఎందుకు అలా వ్యవహరిస్తోందనే విషయంలో మాత్రం ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. కానీ, వచ్చే రెండు మూడేళ్ల తర్వాత.. కేంద్రంలోని మోడీ సర్కారుకు జగన్ తో అవసరం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఇరువురి మధ్య సఖ్యత ఏర్పడుతుందని.. అప్పటి వరకు వైసీపీ వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 29, 2021 11:14 am
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…