Political News

బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోందా ?

త్రిపుర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ అగర్తలలో జరిగిన పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందం అగర్తలలో పర్యటిస్తోంది. ఏదో సర్వే కోసం అగర్తలకు చేరుకున్న బృందం బసచేయటానికి హోటల్లో రూములు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలుసులు వెంటనే హోటల్ కు చేరుకుని వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

కారణం ఏమిటయ్యా అంటే కోవిడ్ సమయంలో 22 మంది ఒకేచోట సమావేశం అయ్యారట. పోలీసులు చెప్పిన కారణం ఎంత సిల్లీగా ఉందో కదా. కోవిడ్ సమయంలో 22 మంది ఒక చోట ఉండటం నిజంగా తప్పే అయితే మరి ఎన్నికల సమయంలో వేలాదిమందిని ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా అండ్ కో ఎలా ఒకచోట చేర్చారు. రోడ్డుషోల్లో ఎన్ని వేలమందిని అలా ఎలా పార్టిసిపేట్ చేయనిచ్చారు ? అప్పుడు ఆయా రాష్ట్రాల్లోని పోలీసులకు కోవిడ్ పాండమిక్ నిబంధనలు గుర్తుకురాలేదా ?

అదంతా కాదుకానీ ఇక్కడ విషయం ఏమిటంటే త్రిపురలో కూడా మమతబెనర్జీ పార్టీ తృణమూల్ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇందుకనే పీకే బృందం త్రిపురలో క్షేత్రస్ధాయి సర్వే చేయాలని డిసైడ్ చేసింది. ఇందుకే అగర్తలకు చేరుకుంది. అయితే ఆల్ రెడీ ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. తృణమూల్ త్రిపురలో అడుగుపెట్టాలని నిర్ణయించడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఇందుకే సర్వే చేయనీయకుండా పీకే బృందాన్ని అదుపులోకి తీసుకున్నది. అంటే ఏదో ఓ రూపంలో పీకే బృందాన్ని ఇబ్బందులకు గురిచేయాలన్నదే బీజేపీ టార్గెట్ గా ఉన్నట్లు అర్ధమైపోతోంది.

అయితే పీకే బృందం పనిని అడ్డుకోవటం ఒక్క త్రిపురలో మాత్రమేనా లేకపోతే తమ పార్టీ అధికారంలో ఉన్న అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ ఇదే విధంగా టార్గెట్ పెట్టుకున్నదా అన్నది తేలాలి. నిజానికి ఒక పార్టీని అధికారంలోకి తేచ్చేంత సీన్ పీకే బృందానికి లేదు. ఒకపార్టీని ఓడించటం, మరోపార్టీని గెలిపించటమన్నది పీకే బృందం వల్ల కానేకాదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని శాస్త్రీయంగా అంచనా వేయగలదు.

ప్రభుత్వం నుండి జనాలు ఏమి కోరుకుంటున్నారు ? ఏఏ నియోజకవర్గాల్లో సామాజికవర్గాల బలమెంత లాంటి అనేక అంశాలపై పక్కాగా సర్వే చేయగలదు. చాలా సంస్ధలు సర్వేలు చేయగలవు కానీ పీకే బృందం లాగ శాస్త్రీయంగా సర్వే చేయగలిగిన సాధనసంపత్తి ఉండదు. అందుకనే పీకే దేశంలో అంత పాపులర్ అయ్యారు. ఇంతచిన్న విషయం కూడా బీజేపీకి అర్ధం చేసుకోకుండా పీకే బృందాన్ని అడ్డుకోవటం వల్ల ఉపయోగమే ఉండదు. జనాలు అనుకుంటే బీజేపీని దింపేసి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీని అధికారంలోకి తేలారా ?

This post was last modified on July 28, 2021 11:55 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

3 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

4 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago