జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో తేలిపోయిందా ? తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరిలోను ఇదే సందేహం పెరిగిపోతోంది. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, జనసేనకు ఈ రెండు జిల్లాల్లో మంచి పట్టుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ దెబ్బకు జనసేన తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.
రెండు జిల్లాల్లో కలిపి 34 నియోజకవర్గాలుంటే జనసేన గెలిచింది కేవలం ఒకే ఒక నియోజకవర్గం రాజోలులో మాత్రమే. సరే అప్పుడంటే ఏదో అలా జరిగిపోయిందని జనసైనికులు సరిపెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ తడాఖా ఏమిటో చూపుతామని గట్టి సవాళ్ళే చేశారు. మార్చి 10వ తేదీన రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగినట్లే ఏలూరు కార్పొరేషన్ కు కూడా జరిగింది. కాకపోతే ఓటర్ల లిస్టులో అవకతవకలున్నాయనే కారణంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.
కోర్టులో కేసు పరిష్కారమైన తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 50 డివిజన్లలో 47 చోట్ల వైసీపీ గెలిచింది. మిగిలిన 3 చోట్ల టీడీపీ నెగ్గింది. జనసేన పోటీచేసిన 20 డివిజన్లు+బీజేపీ పోటీచేసిన 16 డివిజన్లలో మిత్రపక్షాలు కనీసం ఒక్క డివిజన్లో కూడా ఎక్కడా గెలవలేదు. నిజానికి ఏలూరులో కాపుల ప్రాబల్యమే చాలా ఎక్కువ. పైగా ఏలూరుపై దృష్టిపెట్టిన పవన్ ప్రత్యేకంగా ప్రచారం కూడా చేశారు.
మిత్రపక్షాల్లో బీజేపీకి క్షేత్రస్ధాయిలో పెద్ద బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కమలనాదుల్లో ఎక్కువమంది క్షేత్రస్ధాయిలో కన్నా మీడియా సమావేశాల్లోను, టీవీ చర్చల్లో మాత్రమే ఎక్కువగా హైలైట్ అవుతుంటారు. కాబట్టి బీజేపీ అభ్యర్ధులు ఓడిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ తమకు బాగా బలముందని చెప్పుకున్న జనసేన కూడా నూరుశాతం చతికిలపడిపోయిందంటే ఏమిటర్ధం ?
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో జనసేనను తిరస్కరించినట్లే జనాలు ఏలూరులో కూడా తిరస్కరించినట్లు అర్ధమైపోతోంది. కాబట్టి జనసేనను రాష్ట్రం మొత్తంమీద ఇక్కడా అక్కడా అన్న తేడాలేకుండా హోలు మొత్తంమీద జనాలు దూరం పెట్టేశారని అర్ధమవుతోంది. మరి ఈ పరిస్ధితుల్లో మిత్రపక్షాలు తమ బంధంపై పునః సమీక్షించుకుంటాయనే ప్రచారం పెరిగిపోతోంది. అసలే రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. దీనిమీద ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయ్యింది. మరి తాజా ఫలితాలు మిత్రపక్షాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సిందే.
This post was last modified on July 26, 2021 1:41 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…