కొంతమంది ఎంత వివాదాస్పదంగా ఉంటారో పదవులను అంతగా తరుముకుంటు వస్తుంటాయి. అయితే పదవులు వచ్చినట్లే వచ్చి మళ్ళీ చేజారిపోతుంటాయి. అలాంటివారిలో బీఎస్ యడ్యూరప్ప కూడా ఒకరు. ఈనెల 26వ తేదీన కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్డీ రాజీనామా చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు కూడా యడ్డీ పూర్తిస్ధాయిలో ఐదేళ్ళూ పదవిలో కూర్చున్నది లేదు.
యడ్యూరప్ప ఎప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మొదలైపోతాయి అవినీతి ఆరోపణలు. పాలనలో ఆయన మద్దతుదారులతో పాటు కుటుంబసభ్యుల జోక్యం విపరీతంగా ఉంటుందనే ఆరోపణలు బాగా వినిపిస్తుంటాయి. అలాగే అడిగిన వారికి భూ సంతర్పణలు, పరిశ్రమల ఏర్పాటు లైసెన్సులకు డబ్బులు తీసుకోవటం, ఫండ్ రైజింగ్ తో పాటు అవసరమైన పనులు చేసిపెట్టి కోట్లలో ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు మద్దతుదారులు, కుటంబసభ్యులపై బాగా వినబడుతున్నాయి.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న యడ్డీ నాలుగోసారి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. బహుశా అది నిజమే కావచ్చు. ఎందుకంటే రాజీనామా చేయబోతున్నట్లు డైరెక్టుగా ప్రకటించకపోయినా పరోక్షంగా ఆ విషయాన్ని యడ్డీ చెప్పేశారు. మొదటిసారి 2007లో సీఎం అయిన యడ్యూరప్ప కొద్ది రోజులకే రాజీనామా చేసేశారు. అతితక్కువ రోజులు సీఎంగా చేసిన నేతల్లో యడ్డీ రికార్డు సృష్టించారనే చెప్పాలి.
2018 మే 17వ తేదీన బాధ్యతలు తీసుకుని బలం నిరూపించుకోలేక 19వ తేదీన రాజీనామా చేసేశారు. అంటే కేవలం రెండున్నర రోజు మాత్రమే సీఎంగా ఉన్నారు. అంతకుముందు ఒకసారి ఏడాదిన్నర, అంతకన్నా ముందుద ఒకసారి నాలుగేళ్ళు సీఎం కుర్చీలో ఉన్నారు. ఇపుడు రెండేళ్ళు పూర్తవ్వగానే కుర్చీలో నుండి దిగిపోతున్నారు. అంటే పేరుకు మాత్రమే నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు కానీ ఎప్పుడు కూడా ఐదేళ్ళు పదవిలో కూర్చోలేకపోయారు.
ఎప్పుడు సీఎం అయినా అవినీతి ఆరోపణలు రావటం, పదవిలో నుండి దిగిపోవటం. మామూలుగా అయితే ఒకసారి సీఎం అయిన తర్వాత అవినీతి ఆరోపణలతో దిగిపోతే ఇక ఆ తర్వాత మళ్ళీ సీఎం అయ్యే అవకాశం దాదాపు ఉండదు. కానీ 78 ఏళ్ళ యడ్డీ జాతకం మాత్రం భలే విచిత్రంగా ఉంది. నాలుగుసార్లు సీఎం అయితే అందులో మూడుసార్లు అవినీతి ఆరోఫణలతోనే పదవిలో నుండి దిగిపోయారంటే మామూలు జాతకం కాదు.
This post was last modified on July 24, 2021 10:25 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…