తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలు మాంచి హీట్ మీద ఉన్నాయి. ఎవరికివారు.. హుజురాబాద్ లో విజయం సాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ వైపు ఈటల పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ అందరినీ షాకింగ్ కి గురి చేశాయి.
ఎన్నో అనుమానాలు లేవ నెత్తుత్తున్న దళిత బంధుపై స్కీమ్ పై ఓపెన్‌గా కేసీర్ కామెంట్లు చేశారు. అందరూ అనుకున్నట్టు గానే దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే పెట్టామని చెప్పడం పెద్ద దురమం రేపుతోంది. రాజకీయ పార్టీ ఏది చేసినా అది అంతిమంగా ఓట్ల కోసమే స్కీములు పెడతామంటూ చెప్పడం పెద్ద వివాదాస్పదంగా మారింది.
సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సంచలన కామెంట్లు చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అవకాశం వచ్చిదని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరీ ఇంత అహంకారం పనికి రాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈటల రాజేందర్ అయితే ఇలాంటి అహంకారాన్ని ప్రజలు ఓడగొట్టాలంటే కోరుతున్నారు.
కేసీఆర్ ఇలా ప్రకటించడం బరితెగింపునకు నిదర్శనమని ఈటల మండిపడ్డారు. గతంలో GHMC ఎన్నికల్లో కూడా ఇలానే వరదల పేరుతో రూ. 900 కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఆపదల్లో ఉన్నవారికి నేరుగా డబ్బులు చెల్లించదని.. చెక్కుల రూపంలోనే ఇస్తుందన్న ఈటల.. కేసీఆర్ మాత్రం నేరుగా డబ్బులే పంచిపెట్టారని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates