కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారిన పడి వడోదరాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో డాక్టర్లు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చేసింది. తన అవయవాలన్ని దెబ్బతిన్నాయని డాక్టర్లే ధృవీకరిస్తున్నారు.
దీంతో తమ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాలని ఆలోచించిన ఆ మహిళ… తన భర్త నుండి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ పద్ధతితో తల్లి కావాలని భావించింది. కానీ కరోనా బాధితుడి నుండి వీర్యం సేకరించేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతి నిరాకరించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలిపాయి. దీంతో ఆ మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంటనే వీర్యం సేకరించి భద్రపర్చాలని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు అతడి భార్యకు అందించి సహకరించాలని తెలిపింది.
This post was last modified on July 21, 2021 9:34 pm
తెలంగాణ మంత్రి ధరసరి సీతక్క.. ఫైర్.. ఫైర్‌బ్రాండ్! కొన్ని కొన్ని విషయాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింపజేస్తున్నాయి.…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్షేత్రస్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయన…
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…