Political News

వైవీకే టీటీడీ ప‌గ్గాలు.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్‌గా మ‌ళ్లీ వైవీ సుబ్బారెడ్డికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మొగ్గు చూపారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. దీంతో జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఒక‌వైపు సంతోషం వ్య‌క్త‌మ‌వుతున్నా.. వైవీ వ‌ర్గంలో మాత్రం ఒకింత నిరుత్సాహం క‌నిపిస్తోంది.

నిజానికి టీటీడీ బోర్డు ప‌ద‌వికి ఇటీవ‌ల స‌మ‌యం గ‌డిచిపోవ‌డంతో జ‌గ‌న్‌.. బోర్డు ను ర‌ద్దు చేశారు. దీంతో వైవీ.. అటు రాజ్య‌స‌భ కానీ, ఇటు ఎమ్మెల్సీ అయి.. మంత్రిగా కానీ, చ‌క్రం తిప్పాల‌ని భావించారు. దీంతో వైవీపై సోష‌ల్ మీడియాలోనూ మంత్రి అవుతారంటూ.. ప్ర‌చారం సాగింది.

కానీ, ఇప్ప‌టికే.. చాలా మంది వ‌రుస‌లో ఉన్న నేప‌థ్యంలో వైవీని ప‌క్క‌న పెట్టి.. వ్యూహాత్మ‌కంగా మ‌ళ్లీ టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గానే నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. దీంతో వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌పాటు.. వైవీ చైర్మ‌న్‌గానే ఉండాల్సి ఉంటుంది. ఫ‌లితంగా ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు. పాల‌న‌లో ఆయ‌న నేరుగా జోక్యం చేసుకునే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

అయితే.. దీనికి పార్టీలోనే ఉన్న వైవీ వ్య‌తిరేక వ‌ర్గం చ‌క్రం తిప్పింద‌ని.. ముఖ్యంగా ఒంగోలు కు చెందిన మంత్రి ఒక‌రు జ‌గ‌న్ ద‌గ్గ‌ర చ‌క్రం తిప్పి.. వైవీని తిరిగి టీటీడీ కి పంపించార‌ని.. వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, వైవీ ప‌రంగా చూసుకుంటే.. ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై చాలా ఆస‌క్తి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థిగా పోటీచేయాల‌ని అనుకున్నా(వ‌రుస‌గా రెండోసారి) జ‌గ‌న్ అడ్డు చెప్పి.. వ‌ర్గ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాను యాక్టివ్ అయి.. మ‌ళ్లీ పార్టీలో చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ప‌రిస్థితిని మాత్రం అనుకూలంగా మార్చుకోలేక పోయారు. ఇప్పుడు టీటీడీ చైర్మ‌న్‌గా వైవీ మ‌రోసారి చ‌క్రం తిప్పే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌న‌ట్టే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 17, 2021 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాన్‌లీ ఉన్నాడా లేడా? – సందీప్ ఏమన్నాడంటే..

ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…

60 mins ago

అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…

3 hours ago

ఎన్నిసార్లు దొరికిపోతావు త‌మ‌న్?

టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…

3 hours ago

భయపడినట్టే దెబ్బ కొట్టిన అమరన్

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…

5 hours ago

ఆ సుకుమార్.. ఈ సుకుమార్.. ఒక్కరేనా?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…

6 hours ago

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

7 hours ago