Political News

ప‌వ‌న్‌కు టైం లేదు.. మ‌రి రాజ‌కీయాలు?

ప్ర‌జ‌ల కోస‌మే త‌న జీవిత‌మ‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ప్ర‌క‌టించి రెండేళ్ల పాటు జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల్లో ప‌రుగులు పెట్టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు రాజ‌కీయాలు చేసే టైం లేదా? పూర్తిగా సినిమాల‌తోనే బిజీ అయిపోయారా? అంటే అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో తీరిక లేకుండా ఉన్న ఆయ‌న‌.. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి రాజ‌కీయాల్లో ఎదిగేది ఎప్పుడ‌నే మాటలు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయాల కోసం సినిమాలు వ‌దిలేశాన‌ని గ‌తంలో చెప్పిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత త‌న‌కేమైనా ఆస్తులు ఉన్న‌యా? సినిమాలు చేస్తేనే డ‌బ్బులు వ‌స్తాయ‌ని మాట మార్చి మ‌ళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఇప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేశార‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు ఆయ‌న చేతిలో దాదాపు అయిదు సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేసేస‌రికి 2023 గ‌డిచిపోతుంది. 2024లో మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈ నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌లకు ఆయ‌న పార్టీని ఎలా సిద్ధం చేస్తారు? తాను ఎలా సిద్ధ‌మ‌వుతారు? అనేవి జ‌వాబు లేని ప్ర‌శ్న‌ల్లాగే మిగిలిపోనున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2018లో అఙాత‌వాసి త‌ర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న ప‌వ‌న్ గ‌తేడాది వ‌కీల్‌సాబ్ షూటింగ్ కోసం మ‌ళ్లీ సినిమా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. ఈ ఏడాది విడుద‌లైన ఆ సినిమా మంచి విజ‌యం అందుకోవ‌డంతో జోరు మీదున్న ఆయ‌న వ‌రుస సినిమాలు చేయ‌డం మొద‌లెట్టారు. ప్ర‌స్తుతం మ‌ళ‌యాల రీమేక్ అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ చేస్తున్న ఆయ‌న దీని త‌ర్వాత క్రిష్ డైరెక్ష‌న్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లును పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ఆ త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్‌తో పాటు మ‌రో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కొత్త‌గా మ‌రిన్ని సినిమాల‌కు అడ్వాన్స్‌లు కూడా తీసుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే 2023 వ‌ర‌కూ ప‌వ‌న్ ఫుల్ బిజీగా ఉండ‌నున్న‌ట్లే లెక్క‌.

ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదంపై వేచి చూసే ధోర‌ణి అవ‌లంబించిన ప‌వ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పూర్తి స్థాయిలో పోరాటం చేసేలా క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌న‌సేన‌ను ఏ విధంగా ముందుకు న‌డిపిస్తారో చూడాలి.

This post was last modified on July 17, 2021 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

3 minutes ago

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

45 minutes ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

1 hour ago

అమిత్ షాకు షర్మిల కౌంటర్

పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…

1 hour ago

పార్ల‌మెంటు ముందే అధికార-ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌

దేశ చ‌రిత్ర‌లో.. ముఖ్యంగా ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ప‌రిఢ‌విల్లుతున్న భార‌త దేశంలో తొలిసారి ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌..…

2 hours ago

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

3 hours ago