కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ అందక, రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెడ్ ఇప్పించండి అంటూ పైరవీలు చేశారు. ఆస్తులు, పుస్తెలమ్మి కూడా ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టారు. కొన్ని చోట్ల అయితే కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు కూడా క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
అయితే, కరోనా థర్డ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్ ను మించి ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్షలను సడలిస్తున్నారని… కానీ ఆంక్షల సడలింపులో ఏమాత్రం తేడా వచ్చిన కేసులు పెరుగుతాయన్నారు.
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, కేరళలో కేసులు పెరుగుతున్నాయని… ఆంక్షలు సడలించటం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని, అందుకే థర్డ్ వేవ్ వస్తున్న దేశాల్లో మరణాల శాతంతో పాటు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని డా.గులేరియా వివరించారు. థర్డ్ వేవ్ రాకముందే జనం టీకాలు తీసుకోవటం మంచిదని సూచించారు.
This post was last modified on July 16, 2021 3:03 pm
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…