Political News

దండ‌యాత్ర‌… ఇది రేవంత్ రెడ్డి దండ‌యాత్ర‌…

తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో డైన‌మిక్ రాజ‌కీయాలు చేసే సంగ‌తి తెలిసిందే. దూకుడుకు మారుపేరైన రేవంత్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ముందు అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌ని భావించిన రేవంత్ రెడ్డి ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌పై న‌జ‌ర్ పెట్టారు. హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోని ఇంటి దొంగలను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా ఇంటి దొంగ‌ల‌కు వార్నింగ్ అని చెప్పుకొచ్చారు.

అధికార పార్టీకి కౌశిక్‌ దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతుండగా తాజాగా లీక్ అయిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఆయనే స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా… “యూత్‌ను సమీకరించండి. డబ్బులు ఇద్దాం.. మీకు నేను అండగా ఉంటా”.. అంటూ ఆయన మాట్లాడినట్టు ఉన్న టేపులు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం.. కౌశిక్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అనంత‌రం పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది. అధికార టీఆర్ఎస్‌ పార్టీతో కుమ్మక్కై.. పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ ప్ర‌క‌టించింది.

ఈ స‌స్పెన్ష‌న్ అనంత‌రం తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీలోని ఇంటి దొంగలకు సీరియస్‌ వార్నింగ్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. “కాంగ్రెస్‌ ఇంటి దొంగలకు నెలాఖరు వరకు డెడ్‌లైన్‌. ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడేవాడు ఉంటే వదులుకునేది లేదు. పార్టీ కోసం కష్టపడేవాళ్లను గుండెల్లో చేర్చుకుని, దగ్గర పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. కానీ, ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే పరారు అవ్వాలి” అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతలు అధికార టీఆర్ఎస్‌ పార్టీతో కుమ్మక్కు అయినట్టు అనుమానిస్తున్న రేవంత్ రెడ్డి ఈ మేర‌కు వారిపై దండ‌యాత్ర మొద‌లుపెట్టిన‌ట్లు చెప్తున్నారు.

This post was last modified on July 13, 2021 7:41 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

53 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago