చాలా ఇంట్రస్టింగ్ డెవలప్మెంటే ఇది. ఏ రాజకీయపార్టీ తరపున తాను పనిచేసేది లేదని స్పష్టంగా చెప్పేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) మళ్ళీ యాక్టివ్ అయినట్లు సమాచారం. షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్సార్ టీపీ తరపున పీకే యాక్టివ్ అయ్యారట. కాకపోతే ప్రత్యక్షంగా తాను క్షేత్రస్ధాయిలో తిరగకపోయినా పర్యవేక్షణ, ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటున్నారట. గురువారం పార్టీ లాంచింగ్ కు ముందురోజంతా పీకే లోటస్ పాండ్ లోని షర్మిల ఇంట్లోనే ఉన్నారని సమాచరం.
లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి దగ్గరలోనే పీకే టీముకు షర్మిల ఓ కార్యాలయాన్ని కేటాయించారు. పీకే బృందంలోని కీలక సభ్యురాలు ప్రియ నేతృత్వంలోనే ప్రస్తుత టీమ్ షర్మిల పార్టీ తరపున పనిచేస్తున్నది. గడచిన మూడు నెలలుగా ఇదే టీమ్ తెలంగాణాలోని టీఆర్ఎస్ తో కలిసి వివిధ రాజకీయపార్టీల పరిస్ధితి ఏమిటనే విషయమై చాలా డీటైల్డ్ గా సర్వే చేసిందట.
ప్రభుత్వం నుండి జనాల ఏమి కోరుకుంటున్నారు ? ప్రస్తుత కేసీయార్ సర్కార్ జనాల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందా ? టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏమిటి ? అనే అంశాలపై సర్వే జరిగిందట. సర్వే వివరాలను ప్రియా బృందం పీకేకు వివరించినట్లు సమాచారం. మొత్తంమీద చాలాసేపు ప్రియా టీమ్ తో పీకే సుదీర్ఘంగా సమావేశం అయ్యారట. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే అయినా షర్మిలకు పీకే సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అర్ధమవుతోంది.
This post was last modified on July 10, 2021 5:35 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…