Political News

రంగనాయకమ్మకు ఎన్ని గంటల విచారణ అంటే?

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? గుంటూరులో జరిగిన సన్నివేశాన్ని చూస్తే అర్థమవుతుంది. విశాఖ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును చూసి.. సరిగా చెక్ చేసుకోకుండా.. ముందు వెనుకా ఆలోచించకుండా పోస్టు చేసిన 67 ఏళ్ల పెద్ద వయస్కురాలు రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయటాన్ని తప్పు పట్టిన అధికారులు.. తాజాగా ఆమెను విచారించారు. ఆమె పెట్టిన తాజా పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తమైన వేళ.. సీఐడీ అధికారులు ఆమెను రెండున్నర గంటల పాటు విచారించారు. గురువారం మధ్యాహ్నం 12.19 గంటలకు మొదలైన విచారణ దాదాపు 150 నిమిషాలకు పైనే సాగినట్లు చెబుతున్నారు.

విచారణలో భాగంగా ఇరవైకి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణలో రంగనాయకమ్మ చెప్పిన సమాధానాల్లో అత్యధికంగా తనకు అవగాహన లేకపోవటం.. తెలీదన్న మాటతోపాటు.. దుర్ఘటన తీవ్రత నేపథ్యంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు.

టీవీల్లో ఘటన తీవ్రత చూశానని.. దట్టమైన పొగలు వ్యాపించటం.. సమీప గ్రామాల ప్రజలు గ్యాస్ లీకేజీతో ఉక్కిరిబిక్కిరి కావటం చూసి తీవ్రమైనదిగా తాను భావించినట్లుగా ఆమె చెప్పారంటున్నారు. రంగనాయకమ్మ ఫేస్ బుక్ ఖాతాలో ఆమెను అనుసరించేవారు 120 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలోనూ ఆమె ఫేస్ బుక్ ఖాతాలో ప్రభుత్వ పథకాల అమలును తప్పు పడుతూ పోస్టులు పెట్టిన వైనంపైనా ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రజల్ని తప్పు పట్టేలా ఉన్న పోస్టుల్ని వ్యక్తిగత అభిప్రాయంగా ఎలా చెబుతారన్న ప్రశ్నను ఆమెకు వేసినట్లుగా సీఐడీ వెల్లడించింది. అమ్మఒడి.. రైతుభరోసా.. వాహనమిత్ర పథకాల్ని తప్పు పడుతూ పోస్టుల్ని గతంలో ఆమె పెట్టారని.. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ పథకం రద్దు చేస్తామని చెప్పి.. వారి జీతాల్లో 50 శాతం కోత విధించినట్లు ఎద్దేవా చేశారని పేర్కొన్నారు.

తనను తాను సోషల్ మీడియా కార్యకర్తగా చెప్పుకున్న రంగనాయకమ్మ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు చెప్పుకోలేకపోయారంటూ సీఐడీ విడుదల చేసిన ప్రకటనలో ఉండటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. రంగనాయకమ్మ పెట్టిన ఒక పోస్టు ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది తాజా విచారణ ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

This post was last modified on May 22, 2020 12:50 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

1 hour ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

3 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

3 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

4 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

5 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

5 hours ago