భారత షట్లర్ సైనా నెహ్వాల్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఇటీవల బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ట్వీట్ చేసి..సైనా నెహ్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు.. సైనా ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే… జిల్లా పంచాయత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సైనా ట్వీట్ చేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
‘సర్కారీ షట్లర్’ (ప్రభుత్వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి) అంటూ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఆమెను విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడంలో బీజేపీ నైపుణ్యాన్ని ఈ ‘సర్కారీ షట్లర్’ గుర్తించారని సెటైర్లు వేశారు. తమ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు ప్రయత్నిస్తుండడంపై ఓటర్లు ‘డ్రాప్ షాట్’ (బ్యాడ్మింటన్ లో ఓ రకమైన షాట్) ప్రయోగించాల్సిన అవసరం ఉందని జయంత్ చౌదరి చురకలు వేశారు.
అటు తమిళనాడు కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ డాక్టర్ అస్లామ్ బాషా కూడా సైనా ట్వీట్ పై స్పందించారు. “సెక్యులరిజం మీ అభిమానుల మధ్య విభేదాలకు కారణమైంది… ఆడటాన్ని ఎందుకు ఆపేయాలనుకుంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. సైనా నెహ్వాల్ గతేడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
This post was last modified on %s = human-readable time difference 9:48 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…