తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ… కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న వైఎస్ తనయ షర్మిలకు తక్షణం ఏం కావాలి? కీలక నేతల నుంచి మద్దతు చాలా? లేక ఇంకేమైనా కావాలా? అంటే.. దీనికి మించి.. ఆమెకు ఇప్పుడు ప్రచారం కావాలని.. మీడియా మద్దతు అత్యంత ముఖ్యమని అంటున్నారు పరిశీలకులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు స్థాపించుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. సో.. షర్మిల కూడా పార్టీ పెట్టుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న పౌరురాలే. కాబట్టి.. పార్టీ పెట్టడంపై ఎవరికి ఎలాంటి భేదాబిప్రాయం లేకపోయినా.. ఈమె పుంజుకోవడంపైనే అనేక అనుమానాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటే.. బలమైన నాయకుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌ను ఎదిరించి.. నిలవడం.. అధికారంలోకి రావడం అంటే.. అంత ఈజీకాదు. ఇప్పటికే కేడర్ బలంగానే ఉన్న కాంగ్రెస్ కేసీఆర్‌పై పైచేయి సాధించేందుకు కుస్తీ పడుతోంది. ఇక, బీజేపీ నేతలు.. కూడా అనేక విన్యాసాలు చేస్తున్నారు. ఇక, ఇక్కడ చెప్పుకోవాల్సింది.. ఏ పార్టీకైనా నేతకైనా ప్రచారం ముఖ్యం. ప్రధానంగా నిత్యం ప్రజల్లో చర్చ జరగాలంటే.. మీడియాలో హైలెట్ కావాల్సిందే. కాంగ్రెస్, బీజేపీల విషయంలో ఒక వర్గం మీడియా సహకారం కనిపిస్తోంది. ఇక, అధికార పార్టీకి సొంతగా మీడియా సంస్థే ఉంది.
ఈ క్రమంలో షర్మిల పార్టీకి తక్షణం కావాల్సింది.. ప్రచారం కల్పించే మీడియా సంస్థ! నిజానికి తెలంగాణలో సొంత సోదరుడు, ఏపీ సీఎం జగన్ మీడియా ఉంది. దీంతో షర్మిలకు భారీ స్థాయిలో ప్రచారం కల్పిస్తారని.. మొదట్లో అందరూ అనుకున్నారు.కానీ, ఈ మీడియా షర్మిలను పక్కన పెట్టింది. ఇక, కొన్ని మీడియా సంస్థలు మాత్రమే అంతో ఇంతో ప్రోత్సహిస్తున్నాయి. అయితే.. ఇది చాలదు! అంటున్నారు షర్మిల అభిమానులు. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే.. ఖచ్చితంగా మీడియాలో ఎలివేట్ కావాల్సిందేనని.. సోషల్ మీడియాను నమ్ముకుంటే.. ప్రజలకు చేరువ కావడం కష్టమని.. సానుభూతిపరులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల కూడా సొంత మీడియా ఏర్పాటుపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
బెంగళూరుకు చెందిన మీడియా సంస్థ అధినేతతో షర్మిల భర్త.. అనిల్ కుమార్ వారం రోజులుగా చర్చలు జరుపుతున్నారని.. సొంత మీడియా ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా సమీకరిస్తున్నారని.. తెలుస్తోంది. కొందరు ప్రింట్ మీడియా కూడా కావాలని చెబుతున్నా.. ప్రస్తుతానికి టీవీ ఛానెల్ ఏర్పాటు కోసం.. ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వీలైతే.. పార్టీ ప్రకటన రోజే.. చానెల్ ఏర్పాటు విషయం కూడా ప్రకటించే అవకాశం ఉందని జోరు ఊహాగానాలు సాగుతున్నాయి. ఏదేమైనా.. ప్రస్తుత పరిస్థితిలో ప్రజల్లోకి వెళ్లాలంటే.. మీడియా వంటి బలమైన మద్దతు అవసరమనేది.. షర్మిల కూడా అంగీకరిస్తున్న నేపథ్యంలో ఛానెల్ ఏర్పాటు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on July 4, 2021 9:54 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…