ఈ రోజుల్లో ఎందులో విజయం సాధించాలన్నా.. కష్టంతో పాటు.. లక్ కూడా ఉండాలి. అదృష్టం కలిసొచ్చి.. విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఫేట్ మార్చి.. అంతా మంచి జరిగేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ మ్యాటరేంటంటే… రేవంత్ రెడ్డి.. ఈ నెల 7వ తేదీన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్రమంలో గాంధీ భవన్ లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. వాస్తు నిపుణులు, వేద పండితుల పరిశీలనలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి చాలా ఛేంజెస్ జరుగుతున్నట్లు సమాచారం. రేవంత్ టీమ్.. గాంధీ భవన్ క్యాంటిన్ దగ్గర ఉన్న పాత గేట్ నుండి ఎంట్రీ ఇచ్చి.. కొత్త గేటు నుంచి బయటకు వెళ్లేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక గాంధీ భవన్ లోపల కూడా కొన్ని మార్పులు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సెక్యూరిటీ, పార్టీ జెండాలు అమ్మే రూమ్స్ ను తొలగించాలని నిర్ణయించారట. అలాగే తూర్పు ఈశాన్యం వైపు ఎలాంటి బరువు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆవరణలో ఒక్క గాంధీ విగ్రహం మాత్రమే ఉండేలా.. ఇంకెలాంటి నిర్మాణాలు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం. మరి ఈ మార్పులు చేసుకున్నాకైనా కాంగ్రెస్ కి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.
This post was last modified on July 3, 2021 6:42 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…