విపరీతమైన అంచనాలు మోసుకొచ్చిన పెద్ది ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో క్యాస్ట్ అండ్ క్రూ హాజరవ్వగా బాలీవుడ్ మీడియా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అందరూ సినిమా గురించి ఊహించినట్టే గొప్పగా మాట్లాడేశారు. రెహమాన్ సైతం తనను కదిలించిన మొదటి తెలుగు మూవీగా పెద్దిని పొగడ్తలతో ముంచెత్తారు. నిజానికి ఆయనకిది తొలి టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమా కాదు. సరే ఇది కాసేపు పక్కన పెడదాం.
సోషల్ మీడియాతో పాటు బయట అభిమానుల రియాక్షన్లు గమనిస్తే అధిక శాతం పాజిటివ్ ఉన్నప్పటికీ కొంత మిక్స్డ్ టాక్ కూడా కనిపిస్తోంది. కారణం లేకపోలేదు. వాళ్ళు పుష్ప, కిజిఎఫ్ రేంజ్ లో మరీ ఎక్కువగా ఊహించుకున్నారు. అయితే ఇది ముందే పసిగట్టిన దర్శకుడు బుచ్చిబాబు అంచనాలు మితిమీరిపోయి ఏదేదో ఊహించుకుని థియేటర్ కు వస్తే ఇబ్బందవుతుందని గుర్తించి తెలివిగా మూడు నిమిషాల వీడియోలో ఎమోషన్లకు పెద్ద పీఠ వేశాడు.
దీంతో సహజంగానే టాక్ కొంచెం అటు ఇటు మారిపోతుంది. పుష్ప 2 టైంలోనూ మొదటి రెండు రోజులు ట్విట్టర్ స్పందన వేరుగా ఉంది. మెల్లగా సీన్ ఛేంజ్ అయ్యింది. పెద్దికి కూడా అదే జరుగుతుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఎందుకంటే బుచ్చిబాబు గురువు సుకుమార్ బాటలోనే నడిచాడు. వరల్డ్ బిల్డింగ్, విజువల్స్, రా అండ్ డెప్త్ ఎమోషన్స్ చూస్తుంటే ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టే తొలినాళ్ళలో స్పందన మారడం సహజం.
సో ఐటెం సాంగ్ వచ్చి, రిలీజ్ డేట్ దగ్గరపడే టైంకి ఈ సమీకరణాలన్నీ మారిపోతాయి. మాస్ ఎలిమెంట్స్ ఉన్న కారణంగా కంటెంట్ అటుఇటు ఊగినా, పూర్తిగా మెప్పించేలా లేకపోయినా వీరభద్రుడుని మన ఆడియన్స్ ఆదరించారు. మూడు నెలలు సరైన మాస్ బొమ్మ లేకపోవడంతో ఒక్కసారిగా థియేటర్లకు వెళ్లిపోయారు. అలాంటిది పెద్ది ఇంత పాజిటివ్ హైప్ మధ్య, ఛార్ట్ బస్టర్ సాంగ్స్ తో వస్తున్నప్పుడు జరిగే మోత ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. జూన్ 4 దాకా వెయిట్ చేయాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates