Political News

లేని పార్టీని చూసి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్ నేత‌లు.. రీజ‌నేంటి?

తెలంగాణ అధికార పార్టీ నేత‌లు.. మంత్రులు.. కొన్ని రోజులుగా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై తీవ్ర కామెంట్లు చేస్తున్నారు. ఆయ‌న‌ను నీటి దొంగ అని ఒక‌రంటే.. కాదు.. గ‌జ దొంగ అని మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఇంకొంద‌రు.. ఏకంగా ఆయ‌న‌ను న‌ర‌రూప రాక్ష‌సుడ‌ని.. కూడా అనేశారు. నిజానికి తెలంగాణ వాదంతో సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఏడేళ్ల త‌ర్వాత‌.. ఇప్పుడు వైఎస్‌ను తిట్టాల్సిన అవ‌స‌రం ఏంటి? ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య నీటి వివాదాలు ఉంటే.. ఏపీని టార్గెట్ చేసుకుని సీఎం జ‌గ‌న్‌ను కామెంట్ చేయాలి. కానీ.. అనూహ్యంగా ఈ రోచ్చులోకి చ‌నిపోయిన నేత‌ను ఎందుకు లాగుతున్నారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

దీనికి స‌మాధానం.. లేని పార్టీని చూసి భ‌య‌ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైఎస్ కుమార్తె.. ష‌ర్మిల సొంత కుంప‌టి పెట్టుకుని.. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి పాద‌యాత్ర రూపంలో అరంగేట్రం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని టీఆర్ఎస్ నేత‌లు భావిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, బీజేపీ పుంజుకోవ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు, లోపాలు కూడా టీఆర్ఎస్‌ను ఎంత లేద‌న్నా భ‌య‌పెడుతున్నా యి. ఈ స‌మ‌యంలో.. ష‌ర్మిల క‌నుక అరంగేట్రం చేసి.. సెంటిమెంటును రాజేస్తే.. మ‌రింత క‌ష్ట‌మ‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ అధిష్టానం.. మంత్రుల‌ను, నేత‌ల‌ను ముందుగానే అలెర్టు చేసిందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

రాజ‌న్న పేరుతో ఏ సెంటిమెంటునైతే.. ష‌ర్మిల ర‌గిలించాల‌ని చూస్తున్నారో.. అదే సెంటిమెంటు లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే నీటి వివాదాల‌ను అడ్డు పెట్టుకుని వైఎస్‌ను ఏకేస్తున్నార‌ని చెబుతు న్నారు. అయితే.. ఇది కూడా ప్ర‌మాద‌మేన‌ని.. కొంత వ‌ర‌కు విమ‌ర్శించినా త‌ప్పులేద‌ని, కానీ, అదేప‌నిగా.. భారీ డైలాగుల‌తో విమ‌ర్శించ‌డం వ‌ల్ల వ్య‌తిరేక ఫ‌లిత‌మే వ‌స్తుంద‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ఎక్క‌డైనా.. కొంత వ‌ర‌కు విమ‌ర్శ‌లు చేస్తే.. ప్ర‌జ‌లు అర్ధం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు శృతి మించిన ధోర‌ణిలో వైఎస్‌ను ఇన్నేళ్ల త‌ర్వాత ఏకేయ‌డం ప్రారంభిస్తే.. దీనిని రాజ‌కీయ కోణంలోనే చూస్తారు త‌ప్ప‌.. టీఆర్ ఎస్ ఆశించిన ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి నేతలు ఈ విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on %s = human-readable time difference 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిది సినిమాల జాతర ఉంది కానీ

నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…

34 mins ago

ఆ కారు ప్రమాదంపై స్పందించిన విజయమ్మ

2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…

57 mins ago

పవన్ వ్యాఖ్యలపై అనిత ఫస్ట్ రియాక్షన్

ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…

59 mins ago

ముగ్గురు హీరోలు కలిస్తే రచ్చే

కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…

1 hour ago

పవన్ వ్యాఖ్యలపై ఫస్ట్ రియాక్షన్ ఆ మంత్రిదే

పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…

1 hour ago

హనుమంతుడు రిషబ్ అయితే రానా ఎవరు

2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…

4 hours ago