ఔను! రాజకీయాల్లో ఉన్నవారికి కేవలం దూకుడు మాత్రమే కాదు.. మంత్రాంగం కూడా చాలా ముఖ్యం. ఇటు రాష్ట్రం నుంచి అటు కేంద్రం వరకు రాజకీయాలను, రాజకీయ నేతలను మేనేజ్ చేయగల సత్తా ఉంటే.. రాజకీయాల్లో పదికాలాల పాటు మనగలు గుతారనే వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదే గతంలో అనేక మంది నాయకులు చేసి చూపించారు. పర్వతనేని ఉపేంద్ర, కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, పల్లం రాజు, టీజీ వెంకటేశ్.. ఇలా అనేక మంది సీనియర్ నాయకులు.. ఇటు రాష్ట్రంలోను.. అటు కేంద్రంలోను చక్రం తిప్పారు.
ఇక తెలంగాణలో ఇప్పటకీ తన అసమ్మతిని వినిపిస్తూ ఉండేవి. హనుమంతరావు కూడా ఇదే కోవలోని వారే. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు అన్న విషయమే మర్చిపోయిన హనుమంతరావు రాజ్యసభకు ఏకంగా మూడు సార్లు ఎంపికయ్యారు. ఇలాంటి నేతలు తమ మాటలతోనే రాజకీయం చేసేస్తారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి వస్తే..అప్పటికి అలా తమ పంథాలను మార్చుకుని రాజకీయంగా సక్సెస్ అయ్యారు. నిజానికి రాజకీయ నేతలకు ప్రజలు ముఖ్యమే. అదే సమయంలో మంత్రాంగం కూడా అత్యంత కీలకం. ఈ క్రమంలోనే సదరు నేతలు.. ఇటు గల్లీ టు.. అటు ఢిల్లీ వరకు తిరుగులేని నేతలుగా గుర్తింపు పొందారు. తమకంటూ.. ప్రత్యేక కేడర్‌ను నిలబెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్లినా.. గుర్తింపు పొందారు.
అయితే.. ఈ తరహా వ్యూహాలు వేయడంలోను.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పే స్థాయిలో రాజకీయాలు చేయడంలోనూ నేటి తరం.. విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రాజకీయంగా వారి దూకుడు కేవలం నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావడం.. రెండు.. ప్రాంతీయ పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మాకు ఢిల్లీలో ఎవరితోనూ పరిచయాలు లేవు.. అనే నిర్లిప్తతకావడం. ఈ రెండు కారణాలతో .. నేటి తరం నేతలు.. వ్యూహాలకు దూరంగా ఉంటూ.. మంత్రాంగం చేయడంలోను.. రాజకీయంగా తమ ప్రతిభను చాటుకోవడంలోనూ వెనుకబడి పోతున్నారు.
ఇక నేటి తరం సామాజిక సమస్యలను గుర్తించడం.. కేవలం రాజకీయం అంటే రాజకీయంగానే చూడడం, సినియర్ల నుంచి సలహాలు నేర్చుకోవడం లాంటివి నేర్చుకునే ఓపిక ఈ తరం లీడర్లకు ఉండడం లేదు. ఓ ప్రజా సమస్యను పట్టుకుంటే అది పరిష్కారం అయ్యేవరకు గళమొత్తడం, ఫైట్ చేయడం అనేవే వీరు మర్చిపోతున్నారు. ఇక పని కంటే పబ్లిసిటీకే ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు. దీంతో వీరు ఢిల్లీ వెళ్లినా.. మీరెవరు? అనే ప్రశ్న ఎదరయ్యేలా చేస్తోంది. మరి ఇప్పటికైనా.. నేతలు.. తాత్కాలిక ఇమేజ్ కోసం కాకుండా.. కొన్నాళ్లపాటు రాజకీయాల్లో నిలదొక్కుకునేలా వ్యవహరిస్తే.. మంచిదని సూచిస్తున్నారు పరిశీలకులు.
This post was last modified on June 30, 2021 10:54 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…