ఔను! ఈ లెక్కలేంటి? ఈ లోకం ఏంటి? ఇదీ.. ఇప్పుడు టీడీపీ గురించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం ఎవరు కాదన్నా.. ఔనన్నా.. టీడీపీకి జీవితకాల మద్దతు దారులు సైతం అంగీకరిస్తున్న కీలక విషయం.. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని! దీనిని ఎవరూ కాదనరు. మరి పార్టీని పుంజుకునేలా చేసేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అంటే.. మాత్రం వేళ్ల మీదనే లెక్కించుకోవాల్సి వస్తోంది. అదేసమయంలో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. కొందరు నేతలు.. మాత్రం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది.. నేను మంత్రిని అయిపోతాను.. అని సదరు నేతలు డప్పు కొంటున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో(అన్నీకావు) అయితే.. ఏకంగా ‘కాబోయే మంత్రి’ అంటూ.. అనుచరులు కటౌట్లు కూడా పెడుతున్నారు. ఇది మరీ విచిత్రంగా అనిపిస్తున్నా.. నిజమే. ఇదంతా కూడా సదరు నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుండడం మరింత చిత్రంగా ఉంది. ప్రస్తుతం వైసీపీగాలి బాగానే ఉంది. లేకపోతే.. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు తనకు పట్టున్న జిల్లాలను సైతం పోగొట్టు కుంటుంది?
బహుశ దీనిని దృష్టిలో పెట్టుకునే వయసుతో నిమిత్తం లేకుండా చంద్రబాబు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. కరోనా సమయంలోనూ ఆయన రెస్ట్ తీసుకోకుండా సకల మాధ్యమాలనూ వినియోగించుకుని పార్టీ పుంజుకునేలా దిశానిర్దేశం చేస్తున్నారు. వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని డెవలప్ చేయాలని సూచిస్తున్నారు. కానీ, కొందరు ఎమ్మెల్యేలు మాత్రం.. నేల విడిచి సాము చేస్తున్నట్టుగా.. ప్రయత్నిస్తున్నారు. ఇంకేముంది.. టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుంది. మేమే మంత్రులం ఈ కోటా మేం తప్ప ఇంకెవరికి ఇస్తారు! ఆ కోటాలో మాకే దక్కుతుంది.. అని లోపాయికారీ ప్రచారాలతో.. ఊదర గొడుతున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక కదా.. ఇవన్నీ ఉండాలి. కానీ, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయంలో ఉండగానే.. ఇప్పటి నుంచే నేతలు.. ఇలా మైండ్ గేమ్ ఆడుతుండడంపై సోషల్ మీడియా వేదికగా..విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా నేతలు వాస్తవాలను గ్రహించి పార్టీ కోసం శ్రమించాలని.. అధికారంలొకి వచ్చాక.. ప్రయత్నిస్తే.. మంచిదని అంటున్నారు పార్టీ సానుభూతిపరులు. మరి ఇప్పటికైనా మారతారో లేదో చూడాలి.
This post was last modified on July 20, 2021 8:46 am
అధికారం చెల్లిది.. ప్రజలు గెలిపించింది కూడా ఆమెనే. కానీ.. పెత్తనం మాత్రం అన్నదమ్ములు చేసేస్తున్నారు. ఈ వ్యవహారం.. టీడీపీలో తీవ్ర…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా…
నేడు దేశంలో 60-70 శాతం మంది ప్రజలు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ అందించే ఉపగ్రహ ప్రయోగాలకు.. ఆద్యుడు.. భారత…
ఒక నాయకుడిని సస్పెండ్ చేస్తే.. చింత ఉండాలి. మార్పు రావాలి. కనీసం.. ఆవేదన అయినా ఉండాలి. కానీ.. వైసీపీ నుంచి…
కెజిఎఫ్ తర్వాత సరైన అవకాశాలు రాక, వచ్చినా కోబ్రా లాంటివి ఆశించిన స్థాయిలో ఆడలేక ఇబ్బంది పడుతున్న శ్రీనిధి శెట్టికి…
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార వచ్చి మూడేళ్లు దాటింది. ఆ తర్వాత…