Political News

కేజ్రీవాల్ తప్పుడు లెక్కలు.. తేల్చిన ఆడిట్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా బీభత్సం సృష్టించలేదు. ముఖ్యంగా దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మరింత ఎక్కువగా కనపడింది. కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆక్సీజన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రంతో చిన్నపాటి యుద్ధమే చేసింది.

ఢిల్లీ కి ఆక్సీజన్ ఇవ్వాలంటూ.. హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో… కేంద్రం కూడా దిగి వచ్చి తర్వాత ఆక్సీజన్ అందించింది. ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. కాగా.. తమకు ఆక్సీజన్ సరిపోయిన తర్వాత.. ఢిల్లీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు తీసుకోవాలంటూ ఆఫర్ చేయడంతో.. అందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ప్రశంసలు కురిపించారు. అయితే.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ.. ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ ను డిమాండ్ చేసిందని తేల్చింది.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ తాజాగా ఇచ్చిన రిపోర్ట సంచలనంగా మారింది. ఆక్సిజన్ అవసరాన్ని లెక్కించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. 300 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉండ‌గా.. 12వందలు డిమాండ్ చేసిందని తెలిపింది. దానివల్ల 12 రాష్ట్రాల్లో తీవ్ర‌మైన ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింద‌ని స్ప‌ష్టం చేసింది.

ఏప్రిల్ 29 నుంచి మే 10 మ‌ధ్య కొన్ని హాస్పిట‌ల్స్ ఆక్సిజన్ విషయంలో భారీ త‌ప్పిదాలు చేశాయ‌ని క‌మిటీ తేల్చింది. 11వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించామని చెప్పాయని.. లెక్కలన్నీ చూస్తే.. 209 మెట్రిక్ ట‌న్నులుగా తేలింద‌ని వివరించిందిది. డిమాండ్‌ ను స‌రిగ్గా లెక్కించ‌డంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని.. అందుకే అవ‌స‌రం ఉన్న‌దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అడిగింద‌ని స్పష్టం చేసింది కమిటీ.

This post was last modified on June 25, 2021 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

2 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

3 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

3 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

3 hours ago