జగన్ కంపెనీపై హైకోర్టుకు వెళ్లిన ఎంపీ రఘురామ…

నరాసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇప్పుడు సింగిల్ ఎజెండాతో పని చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు.. వారికుటుంబానికి చెందిన వ్యాపార సంస్థలపై ఏదో ఒక లిటిగేషన్ ను తెర మీదకు తీసుకొచ్చి కోర్టును ఆశ్రయించటం అలవాటుగా మారింది. తాజాగా ఆ పరంపరలో మరో పిటిషన్ ను ఏపీ హైకోర్టులోదాఖలు చేశారు.

జగన్ కంపెనీ అయిన సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు పొడిగింపుపై తాజాగా సవాలు విసిరారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయన..మైనింగ్ లీజు పొడిగింపులో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపించారు. ఇదే విషయాన్ని సీబీఐ కూడా నిర్దారించినట్లు రఘురామ పేర్కొనటం గమనార్హం.

సీబీఐ కేసును ప్రస్తావించకుండా లీజు పొడిగింపును పొందారని.. ఇది సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత కంపెనీ కావంతోనే అధికారులునిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో సరస్వతి కంపెనీతో పాటు ఏపీ పరిశ్రమల శాఖ.. మైనింగ్ శాఖ.. ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా చేర్చారు. మరీ.. పిటిషన్ పై హైకోర్టు ఏమంటుందో చూడాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)