వందేళ్ల సీనియార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 51వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. నిజానికి గాంధీల కుటుంబం పరంగా చూస్తే.. ఇందిర, రాజీవ్‌గాంధీలు.. ఈ వయసులోపే.. అంటే ఫార్టీల్లోనే ప్రధానమంత్రి పీఠాలను అధిరోహించారు. అలాంటి రికార్డు ఉన్న గాంధీల వారసుడుగా రాహుల్ కు ఇప్పుడు పెద్దబాధ్యతే ఉంది. ప్రస్తుతం 51వ ఏడులోకి అడుగు పెట్టిన రాహుల్.. కరోనా నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు కన్వే చేశారు.
కలిసి వస్తున్న నేతలు..
ఇక, రాహుల్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా చాలా మంది ముఖ్యమంత్రులు శుభాకాం క్షలు చెప్పారు. ఈ వరుసలో తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సహా ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఉన్నారు. వీరంతా కూడా రాహుల్‌కు ఉజ్వల భవిత ఉండాలని ఆకాంక్షించారు. దీనిని బట్టి.. రాహుల్ పుంజుకుంటే.. తమ సహకారం ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక, దేశంలో ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. కనీసం ఆయనకు 54 ఏళ్లు వచ్చే సమయానికైనా పీఎం పీఠం ఎక్కే చాన్స్ కనిపిస్తోంది.
వ్యూహం ఏంటి?
వాస్తవానికి రాహుల్‌పై కాంగ్రెస్ పార్టీ చాలానే ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌కు ఇప్పుడున్న వారిలో రాహుల్ తప్ప గాంధీల కుటుంబం నుంచి వారసుడు లేరనేది సుస్పష్టం. అయితే.. రాహుల్ హయాంలో వచ్చిన గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక, రాష్ట్రాల్లోనూ ఆయన పుంజుకోలేక పోయారు. ఈ పరిణామంతోనే ఆయన పార్టీ అధ్యక్ష పీఠాన్ని వదులుకు న్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి ఏమీ మించిపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా వ్యూహాత్మకంగా ఆయన దూకుడు చూపిస్తే.. కలిసివచ్చే కాలం సమీపంలోనే ఉందని చెబుతున్నారు.
మోడీ పై వ్యతిరేకత
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని మోడీపై వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. కరోనా విషయంలోను, వ్యాక్సిన్ ఇచ్చే విషయంలోనూ ఆయన అనుసరించిన వైఖరి ఒక ఎత్తయితే.. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదేసమయంలో సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ధరలు పెంచడం.. సబ్సిడీలను కోసేయడం వంటివి కూడా జనాగ్రహానికి కారణాలు గా ఉన్నాయి. యువతకు ఉపాధి కల్పించలేక పోతున్నారనే వాదన కూడా ఉంది. ఇలాంటి అనేక పరిణామాలను రాహుల్ తనకు అనుకూలంగా మార్చుకుంటే.. గెలుపు తథ్యమనేది ప్రధాన సూచన. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 20, 2021 10:09 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…