తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నడుస్తుంటే మరోవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల పర్వం కొనసాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఇందులోకి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన సైతం తీసుకువచ్చి ఆమె టార్గెట్ చేశారు.
ప్రధాని మోడీ వీఐపీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని…. 2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దీనిపై తాజాగా విజయశాంతి స్పందిస్తూ “135 కోట్ల పైబడి జనాభా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజం ఓవైసీ జీ. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి” అని విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
“మొత్తం వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం VIP కల్చర్ అయితే…, TRS రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా? ఒవైసీ గారు” అంటూ విజయశాంతి సెటైర్ వేశారు. ఇటు టీఆర్ఎస్ పార్టీని అటు ఎంఐఎంను ఏకకాలంలో విజయశాంతి టార్గెట్ చేసిన ఎపిసోడ్ పై ఇరు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
This post was last modified on June 8, 2021 9:32 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…