తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అంటూ పదే పదే టీడీపీ నేతలు చెప్పుకొంటుంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట అంటే అదే ఫైనల్ అని నడుచుకునే సంస్కృతి పార్టీలో ఉందని వివరిస్తుంటారు. అయితే, అలాంటి పార్టీలో, అందులోనూ కుప్పంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజక వర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలా స్పందించనున్నారనే ఉత్కంఠ సహజంగానే నెలకొంది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ 40 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ జెండాను కుప్పం నియోజకవర్గంలోని మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సభ్యులు ఎగరేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు సహజంగానే రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో మారుతున్న పరిణామాలకు నిదర్శనమా అనే టాక్ సైతం వినిపిస్తోంది.
కాగా, కుప్పంలో ఎన్టీఆర్ ప్రస్తావన ఇదే మొదటిసారి కాదు. ఇటీవల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎప్పుడు తీసుకువస్తున్నారంటూ కార్యకర్తలు చంద్రబాబును ప్రశ్నించారు. ఈ సమయంలో చంద్రబాబు వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. అయితే, తాజాగా మళ్లీ అదే పరిస్థితి కుప్పంలో జరగడం చర్చకు కారణంగా మారుతోంది.
This post was last modified on June 6, 2021 9:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…