విజయవాడ టీడీపీ నేతల మధ్య రాజకీయాలు ఇంకా దారిలో పడలేదు. ఎంపీ కేశినేని నాని కేంద్రంగా నాయకులు విడిపోయిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తలెత్తాయని భావిస్తున్నప్పటికీ.. దీనికి ముందు గత ఎన్నికల సమయం నుంచే నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే.. కార్పొరేషన్ ఎన్నికల సమయానికి వచ్చే సరికి మాత్రం ఇవి మరింత ముదిరి వీధినపడ్డాయి. విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా.. కేశినేని తన కుమార్తె శ్వేతను ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ వివాదాలు బ్లాస్ట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని.. అప్పటికి సర్దు బాటు చేశారు. అయితే.. అసలు రగడ మాత్రం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. పశ్చిమ నియోజక వర్గం సీటుపై కేశినేని నాని దృష్టి పెట్టడమేనని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి గత 2019 ఎన్నికల్లో నే ఇక్కడ నుంచి తన కుమార్తె శ్వేతను రంగంలోకి దింపాలని భావించారని, కానీ, వైసీపీ నుంచి వచ్చిన జలీల్ ఖాన్.. తన కుమార్తెకు ముందుగానే రిజర్వ్ చేయించుకోవడంతో.. కేశినేని ప్రయత్నాలు ఆదిలోనే ఆగిపోయాయి.
ఇక, గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జలీల్ కుమార్తె ఖతూన్ ఓటమి తర్వాత.. అజా లేకుండా పోయారు. దీంతో ఇక్కడ టీడీపీ తరఫున రంగంలోకి దిగే నాయకులు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కేశినేని వచ్చే ఎన్నికల నాటికి తన కుమార్తెను ఇక్కడ నుంచి బరిలో నిలిపాలనే వ్యూహం రచిస్తున్నారనేది కొన్నాళ్లుగా టీడీపీలో జరుగుతున్న చర్చ. అయితే.. దీనిని పశ్చిమలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా.. వంటివారు వ్యతిరేకిస్తున్నారు.
ఇక, వీరికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా తోడయ్యారు. దీంతోనే ఎంపీ కేంద్రంగా వివాదం రాజుకుందని.. పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న కేశినేని నాని దూకుడుతో.. చాలా మంది నాయకులు సైలెంట్ అయిపోయారని.. ఇక, వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి ఇద్దరు గెలిస్తే.. మరింత నేతలకు ఇబ్బందేనని వీరు భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే కార్పొరేటర్‌గా విజయం దక్కించుకున్న శ్వేత.. దూకుడు తగ్గించుకుని.. కింది స్థాయి వారికి కూడా ప్రాధాన్యం ఇస్తే.. అప్పటికి కొంత రాజకీయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
అయితే.. ఇప్పటికిప్పుడు మాత్రం.. బెజవాడ నేతల మధ్య పశ్చిమ సీటు విషయం మాత్రం రగడగానే ఉండడం గమనార్హం. దీనిపై అటు చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ.. స్పందించకపోవడం.. కేశినేని దూకుడుగా ఉండడం వంటివి.. పార్టీకి ఇబ్బందిగా పరిణమించాయని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. తన సీటు తన కుటుంబానికే కేటాయించాలని జలీల్ ఖాన్ పట్టుబడుతున్నారు. మొత్తంగా చూస్తే.. పశ్చిమ సీటు టీడీపీలో వివాదాలకు కేంద్రంగా మారిందనేది వాస్తవం.
This post was last modified on June 6, 2021 7:21 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…