తమిళనాడు రాజకీయాల్లో వీకే శశికళ అలియాస్ చిన్నమ్మ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా ? అవుననే అంటున్నాయి ఏఐఏడీఎంకే వర్గాలు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అన్నా డీఎంకే ప్రస్తుతం నాయకత్వలేమితో ఇబ్బందులు పడుతోంది. ఉండటానికి మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ ఇద్దరిలో ఎవరికి కూడా ప్రజాకర్షణ శక్తి అంతగా లేదన్నది వాస్తవం.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా శశికళే వీళిద్దరికన్నా నయం అనే పరిస్ధితి ఇపుడు పార్టీలో మొదలైంది. దీన్ని చిన్నమ్మ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తొందరలోనే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తానని ఈమధ్యనే చిన్నమ్మ పేరుతో విడుదలైన ఓ ఆడియో సందేశం పార్టీల్లో కలకలం సృష్టించింది. దానికి ఫాలోఅప్ గానే ఏఐఏడీఎంకేలోని సీనియర్ నేతలతో చిన్నమ్మ రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్లు తాజాగా బయటపడింది.
ప్రతిరోజు ఏఐఏడీఎంకేలోని కొందరు నేతలు చిన్నమ్మ ఇంటికి వెళ్ళి సమావేశమవుతున్నారట. ఇక జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు కూడా శశికళ ఆశీర్వాదం కోసం ఇంటి దగ్గర క్యూ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిరోజు 50 మందికి తగ్గకుండా నేతలతో చిన్నమ్మ సమావేశం అవుతున్నారట. చిన్నమ్మను కలుస్తున్న నేతల్లో కొందరు ఎంఎల్ఏలు కూడా ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం పెరిగిపోతోంది.
సో పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఓ పద్దతి ప్రకారం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రాధాన్యతను పార్టీలో తగ్గిపోయేట్లు చిన్నమ్మ పావులు కదుపుతున్నట్లు అనుమానంగా ఉంది. పార్టీలో తనకున్న మద్దతుదారులపైన, పట్టు విషయంలో ఓ నిశ్చితాభిప్రాయానికి రావటానికే శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ విషయమై చిన్నమ్మ ఓ నిర్ణయానికి రాగానే ముందుగా రాష్ట్రంలో పర్యటన పెట్టుకుంటారని సమాచారం. అంతకుముందు జిల్లాలవారీగా సమావేశాలు పెట్టుకుని తన పట్టును ప్రదర్శించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా తొందరలోనే ఏఐఏడీఎంకేపై తిరిగి పట్టు సాధించే దిశగానే చిన్నమ్మ పావులు కదుపుతున్నారన్నది వాస్తవం.
This post was last modified on June 4, 2021 8:02 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…