కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్రమోడి ఫెయిల్యూర్ ను బీజేపీ నేతలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. కోవిడ్ నియంత్రణ, రోగులకు వైద్యం అందించే విషయంలో రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసిందంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నిజానికి కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వాలు విఫలమైందంటే ముందు తప్పు పట్టాల్సింది నరేంద్రమోడినే. మోడి బాధ్యతారాహిత్యం కారణంగా దేశంలో రెండో దశ తీవ్రత ఇంతస్ధాయిలో పెరిగిపోయింది.
దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభం ఈ స్ధాయిలో ఉందంటే మోడినే కారణమని అంతర్జాతీయ మీడియాతో పాటు దేశంలోని అనేక రంగాల్లోని ప్రముఖులు మోడిపై ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు మోడినే తప్పుపడుతు అనేక ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి-మార్చిలోనే సెకెండ్ వేవ్ తీవ్రతపై తాము హెచ్చరించినా మోడి పట్టించుకోలేదని బహిరంగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
టీకాల ఉత్పత్తి, సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా తదితరాలపై మోడి ఘోరంగా విఫలమైన కారణంగానే దేశంలో ఇపుడీ పరిస్ధితులు దాపురించాయని అందరు ధ్వజమెత్తుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళా నిర్వహణే కొంపముంచినట్లు అందరు డైరెక్టుగా చెబుతున్నారు. అన్నీవైపుల నుండి తనపై మొదలైన దాడులను తట్టుకోలేక చివరకు మోడి కూడా జనాలతో ఎక్కడా మాట్లాడటంలేదు. వాస్తవాలు ఇలాగుంటే రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం అన్నింటికీ జగన్మోహన్ రెడ్డే కారణమంటున్నారు.
రాష్ట్రస్ధాయిలో జగన్ తప్పులు కూడా ఉండచ్చు. ఆక్సిజన్ ఉత్పత్తికి ప్లాంట్ల ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. ఆక్సిజన్ అవసరాలు ఈ స్ధాయిలో ఉంటుందని అంచనా వేయకపోవటం ప్రభుత్వ తప్పిదంగానే భావించాలి. మూతపడిపోయిన ప్లాంట్లను తెరిపించుంటే బాగుండేది. టీకాల వేసే విషయంలో ప్రైవేటురంగానికి అవకాశం ఇవ్వద్దని జగన్ ప్రధానికి లేఖ రాయటమే బీజేపీ నేతలకు బాగా కోపం వచ్చినట్లుంది.
ప్రభుత్వాధినేతగా అన్నీ విషయాలు ఆలోచించి టీకాల కార్యక్రమం సజావుగా సాగటానికి జగన్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం బీజేపీ నేతలకు లేదు. ఎందుకంటే టీకాలు వేయించటమనేది పాలసీ కార్యక్రమం. కేంద్రంలో నరేంద్రమోడి, రాష్ట్రంలో జగన్ మధ్య జరుగుతున్న వ్యవహరం. మధ్యలో కమలనాదులకు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. టీకాల విషయంలో మోడి నిర్ణయాలు మొదటినుండి అస్తవ్యస్ధంగానే ఉంటున్నాయి. దీంతోనే దేశవ్యాప్తంగా మోడిపై జనాగ్రహం పెరిగిపోతోంది.
This post was last modified on May 24, 2021 2:10 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…