ప్రతి వారాంతంలో తనదైన కామెంట్ తో భారీ పొలిటికల్ వ్యాసాన్ని రాసే అలవాటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కేకు ఉందన్న విషయం తెలిసిందే. వారం మొత్తమ్మీదా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఆయన విశ్లేషణ సాగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణతో పోలిస్తే.. ఏపీ మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. జగన్ ను విమర్శించటం.. తప్పు పట్టటం లాంటివి తాము చేస్తున్నామని.. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపటంలో తప్పేముందన్న సమర్థింపు చేశారు.
నరసాపురం ఎంపీ రఘురామపై కేసు నమోదు చేయటం.. అరెస్టు సందర్భంగా ఆయనపై దాడి జరిగిందన్న ఆరోపణతో పాటు.. వివిధ న్యాయస్థానాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. తదనంతర పరిణామాల్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలక అంశాన్ని వెల్లడించారు. రఘురామ కేసులో తమ ప్రభుత్వం ఏ స్థాయిలోనూ జోక్యం చేసుకోలేదంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ.. ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలీసుల కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామపై దాడి జరగలేదని.. అందుకు తగిన వైద్య నివేదిక గుంటూరు ఆసుపత్రి ఇచ్చినట్లుగా తెలసిందే. అయితే.. రఘురామపై దాడి చేసిన పోలీసుల్ని రక్షించుకోవటం కోసం వైద్య నివేదికను అనుకూలంగా ఇవ్వాల్సిందిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లుగా పేర్కొన్నారు ఆర్కే తన వ్యాసంలో. అంతేకాదు.. ఈ ఉదంతానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని.. తన మీద కానీ.. ఏబీఎన్ మీద కానీ ఇంకో కేసు పెట్టుకోవచ్చంటూ ఆయన సవాలు మాదిరి వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే రఘురామ బెయిల్ పిటీషన్ పై సుప్రీం విచారణ సందర్భంగా రఘురామ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రఘురామపై దాడి జరగలేదని.. గాయాలు లేవని నివేదిక ఇచ్చిన అధికారికి.. ఏపీ అధికార పార్టీకి మధ్యనున్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపీ నేతగా పేర్కొన్నారు. ఇలాంటివేళలో.. తాజాగా ఆర్కే తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నట్లుగా చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు పెట్టుకోవచ్చన్న మాటను కూడా ఆయన చెప్పారంటే.. ఆయన దగ్గరున్న విషయం అంత పెద్దదా? అన్నది ప్రశ్నగా మారింది. మొత్తంగా రఘురామ ఎపిసోడ్ రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు తావిచ్చేదిలా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on May 23, 2021 7:13 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…