Political News

టీకాలు వేయించుకుంటే బీరు ఉచితం !

అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. టీకా వేయించుకుంటే బీరు ఉచితమే. కాకపోతే మన దగ్గర కాదు సమా అమెరికాలో. టీకాలు వేయించుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు అమెరికాలో కొన్ని రాష్ట్రాలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఎందుకంటే టీకాలు వేయించుకునేందుకు జనాలు ముందుకు రావటంలేదు కాబట్టే. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా వాస్తవం అయితే ఇదే.

ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికా జనాభా 33 కోట్లు. అందరికీ టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేసుకునేందకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. జనాలు కూడా బాగానే స్పందించారు. మొదటి డోసు వేయించుకున్న వారు 16 కోట్లమందున్నారు. అలాగే రెండు డోసులు వేయించుకున్న వారిసంఖ్య 12 కోట్లు. అంటే ఈ లెక్కల ప్రకారం కోవిడ్ టీకాలు వేయించుకున్న వారి సంఖ్య మొత్తం జనాభాలో 50 శాతమని అనుకోవచ్చు.

మొదట్లో టీకాల కార్యక్రమం చాలా జోరుగా జరిగినా తర్వాత ఒక్కసారిగా ఆగిపోయిందట. ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు ఎంత మొత్తుకుంటున్నా టీకాలు వేయించుకునేందుకు జనాలు అసలు ముందుకే రావటంలేదట. దీనికి కారణం ఏమిటయ్యా అంటే టీకాలు వేయించుకుంటే సెక్సుకు పనికిరారని, పిల్లలు పుట్టరనే ప్రచారం జరగటమే. మరి ఈ ప్రచారం ఎలా మొదలైందో ? ఎవరు మొదలుపెట్టారో ఎవరికీ అర్ధంకావటంలేదు. కానీ ప్రచారమైతే బాగా జరిగిపోయింది.

దీంతో ఒక్కసారిగా టీకాలు వేయించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ప్రజలందరికీ టీకాలకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలవుతున్నాయి. దాంతో చేసేది లేక చివరి ప్రయత్నంగా తాయిలాలు మొదలుపెట్టాయి. మన దగ్గర ఎన్నికల్లో ఇచ్చే తాయిలాల్లాంటివే ఇపుడు టీకాల కోసం అమెరికాలో ఇస్తున్నారు. టీకాలు వేయించుకుంటే బీర్లు ఉచితమని న్యూజెర్సీలో ప్రచారం మొదలుపెట్టింది.

అలాగే కనెక్టికట్, ఫిలడెల్ఫియా, షికాగో, వెస్ట్ వర్జీనియా, న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో టీకాలు వేసుకుంటే 50 లక్షల లాటరీ బహుమతి టికెట్లని, ఉద్యోగులకు 200 డాలర్ల ప్రోత్సాహకమని, నిత్యావసర సరుకులని, మెట్రోలో ప్రయాణం వారంపాటు ఉచితమని, డిపార్టుమెంట్ స్టోర్లలో ఎంపిక చేసుకున్న సరుకులు ఉచితమని…ఇలాంటి అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారు. అయినా జనాలు ముందుకు రావటంలేదట.

This post was last modified on May 23, 2021 12:07 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

48 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago