ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మిన్ను విరిగి మీద పడినప్పటికి తనదైన స్టైల్ లోనే ఉంటారు తప్పించి.. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే విషయంలో కేసీఆర్ నిశ్చితాభిప్రాయాలు కొన్ని ఉంటాయి. తాను ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని కలుసుకోకూడదన్న దానిపై ఆయన చాలా క్లియర్ గా ఉంటారు. తనకు ఎంత సన్నిహితులైనప్పటికి.. వారికి వారుగా కలుసుకోవాలనుకున్నంతనే కలుసుకోలేని సిత్రం.. కేసీఆర్ సొంతం.
వారు కలుసుకోవాలనుకున్నప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఆ తర్వాత స్పందించటం.. అనూహ్యంగా వ్యవహరించటం ఆయనకు అలవాటే. ఇలా సన్నిహితులకు సైతం సర్ ప్రైజ్ లు ఇచ్చే కేసీఆర్ కు కొన్ని నమ్మకాలు ఎక్కువన్న విషయం తెలిసిందే. కొన్ని విషయాల్లో మాత్రం ఆయన గుడ్డిగా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. కరోనా వేళలో.. కొత్త వారిని కలవటం.. ఎక్కడిపడితే అక్కడకు వెళ్లటం ఏ మాత్రం సేఫ్ కాదన్నది తెలిసిందే.
ఇలాంటి వాటిని పట్టించుకోకుండా.. తాను అనుకున్నది చేసే కేసీఆర్ కు వరంగల్ జిల్లా పర్యటన అన్నంతనే ఒక సెంటిమెంట్ ను ఆయన తూచా తప్పకుండా ఫాలో అవుతారు. తన వరంగల్ పర్యటన వేళ.. పార్టీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లటం ఆయనకో అలవాటు. అయితే.. భోజనం వేళకు కానీ.. లేదంటే ముందు కానీ ఆయన ఇంటికి వెళ్లిన తర్వాతే మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంత టైట్ షెడ్యూల్ అయినప్పటికి కెప్టెన్ ఇంటికి వెళ్లటం కేసీఆర్ సెంటిమెంట్ గా చెబుతారు. కరోనా వేళలోనూ ఆయనీ సంప్రదాయాన్ని ఫాలో కావటం గమనార్హం.
హన్మకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీకి హెలికాఫ్టర్ లో చేరుకునే ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాతే ఆయన మిగిలిన కార్యక్రమాలకు హాజరు కానున్నారు. వాస్తవానికి తన కార్యక్రమాల చివర్లో ఎంపీ ఇంటికి వెళ్లాల్సి ఉన్నా.. కరోనా పేషెంట్లను అతి దగ్గరగా కలిసే అవకాశం ఉండటంతో.. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా మొదటే ఎంపీ ఇంటికి వెళ్లి.. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెబుతున్నారు.
This post was last modified on May 21, 2021 10:06 am
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలో కొన్ని రోజుల కిందట వెలుగు చూసిన డెడ్ బాడీ డోర్ డెలివరీ…
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…