జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అవసరానికి వాడుకుని వదిలేశాడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. 2009 ఎన్నికల ముంగిట ప్రచారానికి తారక్ సాయం తీసుకోవడం, అప్పుడు అతడికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇవ్వడం.. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అతణ్ని పట్టించుకోకపోవడం.. పైగా ఆ పరాజయాన్ని తెలుగుదేశం వర్గాలు అతడికి ఆపాదించే ప్రయత్నం జూనియర్ రాముడి అభిమానులను బాధించిన మాట వాస్తవం. తారక్‌ను ఆదరిస్తే, ప్రోత్సహిస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌కు పోటీగా ఎతయారవుతాడో అన్న భయం చంద్రబాబులో ఉందని, అందుకే తారక్‌ను దూరం పెడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఐతే తెర వెనుక ఏం జరిగినప్పటికీ.. పైకి తారక్‌ను గుర్తించడంలో, అతడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంలో తప్పేముందన్నది చాలామంది మాట.
చంద్రబాబు ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటారు. తన పార్టీ ప్రముఖులు, సన్నిహితులు అనే కాదు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ప్రముఖుల పుట్టిన రోజులు వస్తే శుభాకాంక్షలు చెబుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం పట్టించుకోరు. అతడి పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు చాలా ఏళ్ల నుంచి కనిపించవు. దీని గురించి తెలుగుదేశం పార్టీలోని తారక్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. శుభాకాంక్షలు చెబితే చంద్రబాబుకు పోయేదేముంది అంటారు. పూర్తిగా సినిమా వాళ్లను విస్మరిస్తే ఓకే కానీ.. కొందరికి శుభాకాంక్షలు చెప్పి, తారక్‌ను పట్టించుకోకపోవడం ఏంటని అంటుంటారు.
గురువారం తారక్ 38వ పుట్టిన రోజును జరుపుకోగా.. చంద్రబాబు ఈసారి కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. గురువారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు జిల్లా స్థాయి నేతలకు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పడం గమనార్హం. దీంతో తారక్ అభిమానులు మరింతగా ఆగ్రహాానికి గురవుతున్నారు. ఐతే చంద్రబాబు చెప్పకపోయినా ఆయన తనయుడు నారా లోకేష్ మాత్రం తారక్‌కు విష్ చేస్తూ ఒక ట్వీట్ వేయడం విశేషం. ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి.. ‘‘తారక్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు లోకేష్.
This post was last modified on May 20, 2021 6:36 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…