Political News

మంత్రి వెల్లంప‌ల్లి నిర్వాకం.. జ‌గ‌న్ ఆఫీస్ నుంచి ఫోన్‌..!


విజ‌య‌వాడ‌కు చెందిన మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుకు సీఎంవో నుంచి ఫోన్ వ‌చ్చిందట‌! ‘ఇలా చేస్తే.. ఎలా? ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం చేసిందంతా కూడా మ‌ట్టిపాలై పోయిందిగా..!’ అని సున్నితంగా ఓ కీల‌క స‌ల‌హాదారుడు.. మంద‌లించిన‌ట్టు విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యంలో ప్ర‌భుత్వం వ్యాక్సిన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి.. 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తోంది. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ న‌డిబొడ్డున ప్ర‌భుత్వ అధికారులు, క‌లెక్ట‌ర్ అనేక సార్లు ప‌ర్య‌టించి.. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడిచే షేక్‌ రాజా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.

ఇది విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు అన్ని మూల‌ల నుంచి వ‌చ్చే వారికి ఎంతో అందుబాటులో ఉండేది. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు ఇక్క‌డ కొంత సేపు వెయిట్ చేసేందుకు గుడారాల‌ను కూడా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ మందికి గ‌త ప‌ది రోజులుగా ఇక్క‌డ వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే.. మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌రావు.. రెండు రోజుల కింద‌ట ఇక్క‌డ ప‌ర్య‌టించి.. వ్యాక్సిన్ కేంద్రం ఇక్క‌డ బాగోలేదు.. అంటూ.. హుటాహుటిన త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొత్త‌పేట‌లో ఉన్న కేబీఎన్ క‌ళాశాల‌కు మార్చేశారు.

అయితే.. ఈ క‌ళాశాల పేరు గొప్ప‌దే అయినా.. మౌలిక స‌దుపాయాలు అంతంత మాత్రం. కూర్చునేందుకు కానీ, ఓ వంద మంది వ‌స్తే.. నిల‌బడేందుకు కానీ ఎలాంటి స‌దుపాయాలు లేవు. దీంతో ఇక్క‌డ ప్ర‌జ‌లు ఒక‌రిపై ఒక‌రు కూర్చునే ప‌రిస్థితి వ‌చ్చింది. నిన్న ఏకంగా.. క‌రోనా వ్యాక్సినేష‌న్‌కు వ‌చ్చిన వారి మ‌ధ్య తోపులాట‌లు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఈ వార్త‌లు పెద్ద‌గా రావ‌డంతో ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్లింది. దీంతో దీనిపై సీరియ‌స్ అయిన సీఎం.. ఇదేం ప‌ద్ధ‌తి.. అస‌లు మంత్రుల‌ను వ్యాక్సిన్ విష‌యంలో ఎవ‌రు జోక్యం చేసుకోమ‌న్నారు? అంటూ.. స‌ల‌హాదారుతో ఫోన్ చేయించి మ‌రీ .. వాయించేశార‌ట‌. దీంతో ఇప్పుడు మంత్రిగారు కిక్కురు మ‌న‌డంలేద‌ని అంటున్నారు.

This post was last modified on May 12, 2021 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

5 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago