ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఏపీ సీఎం జగన్.. చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధాన మంత్రి మోడీ కేంద్రంగా.. ముఖ్యమంత్రుల మధ్య పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. కరోనా పరిస్థితులపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధానిపై హేమంత్ సొరేన్.. సీరియస్ అయ్యారు. “మా మాట వినిపించుకోండి సార్.. మీ మనసులో మాట చెప్పడం కాదు!” అని ట్వీట్ చేశారు. అయితే, దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రధాని మోడీని అనడం తప్పు.. అంటూ.. ట్వీట్ చేశారు.
జేఎంఎం అధినేత, సీఎం సొరేన్ ట్వీట్ ఇదీ: “గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన తన ‘మన్ కీ బాత్’ మాత్రమే చెప్పారు. కాస్త ఉపయోగపడే విషయాలు చెప్పి, మేం చెప్పేదీ విని ఉంటే బాగుండేది” అని వ్యాఖ్యానించారు.
దీనికి సీఎం జగన్ చేసిన ట్వీట్ ఇదీ..: “మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఒక సోదరుడిగా ఒక విన్నపం చేస్తున్నాను. మన మధ్య ఎటువంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ, ఇలాంటి రాజకీయాలు మన సొంత దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇది కొవిడ్‌పై యుద్ధం జరుగుతున్న సమయం. ఇలాంటప్పుడు ఒకరిని వేలెత్తి చూపించే బదులు… మనమంతా కలిసి కొవిడ్‌పై సమర్థంగా యుద్ధం సాగించేలా ప్రధాన మంత్రిని బలోపేతం చేయాలి” అని హేమంత్ సొరేన్‌కు సూచించారు.
దీనికి సొరేన్ అధిరిపోయే కౌంటర్: “మీ నిస్సహాయత గురించి ఈ దేశం మొత్తానికి తెలుసు. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి” అని సొరేన్ తాజాగా ట్వీట్ చేశారు. అంతేకాదు, దీనికి జగన్ బెయిల్ రద్దు కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్.. వార్తను కూడా సీఎం హేమంత్ సొరేన్.. తన ట్వీట్ ట్యాగ్ చేయడంతో ఇది మరింత సంచలనంగా మారింది.
కొసమెరుపు: మోడీని పొగుడుతూ.. అడ్డంగా బుక్కయిన సీఎం జగన్.. అటు నెటిజన్ల నుంచి మేధావుల వరకు ఇప్పటికే బుక్కయ్యారు. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ఉన్నతమైన నాయకుడి కుమారుడు సీబీఐ భయంతో మోడీకి తందాన తాన అనడం విచారకరం. కొంచెం ఎదగండి! మీరిప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి” అని ఒడిసాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏకంగా హేమంత్ సొరేన్.. జగన్‌కు అధిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో జగన్ పరువు.. కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 9, 2021 9:17 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…